కూరగాయలు సరిగ్గా వేయించడానికి అధిక వేడి అవసరం. నాన్-స్టిక్ పాన్‌లు అటువంటి అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునేలా తయారు చేయలేదు. అధిక వేడి పాన్ పూతను దెబ్బతీస్తుంది. హానికరమైన రసాయనాలను కూడా విడుదల చేస్తుంది.అందువల్ల, కూరగాయలను వేయించడానికి కాస్ట్ ఐరన్ లేదా స్టెయిన్‌లెస్ స్టీల్ పాన్‌లను ఉపయోగించడం ఎల్లప్పుడూ మంచిది.
ఖాళీ పాన్‌ను ఎక్కువసేపు వేడి చేయవద్దు
నాన్-స్టిక్ పాన్‌ను ఎప్పుడూ ఖాళీగా ,అధిక మంటపై వేడి చేయవద్దు. అలా చేయడం వల్ల పాన్ పూత చాలా త్వరగా దెబ్బతింటుంది. పాన్ ఖాళీగా ఉన్నప్పుడు, దాని ఉపరితల ఉష్ణోగ్రత వేగంగా పెరుగుతుంది, ఇది పూతను దెబ్బతీసే అవకాశం ఉంది. మీ పాన్ ఎక్కువ కాలం పని చేయాలి అంటే, ఖాళీ పాన్ ఎక్కువ సేపు వేడి చేయకూడదు. నూనె వేసి మాత్రమే వేడి చేయాలి. అప్పుడే ఎక్కువ కాలం పని చేస్తుంది. పాన్ మీద పూత పోయిన తర్వాత దానిని వాడకపోవడమే మంచిది.