ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా శరీరాన్ని లోపలి నుంచి బలోపేతం చేసి మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరిచే బెస్ట్ చిట్కా ఇది. మరి, ఇది ఎవరికి ప్రయోజనకరమో చూద్దాం..
పాలు, ఎండు ద్రాక్ష రెండూ పోషకాలతో నిండి ఉంటాయి. ఈ రెండూ కలిపి తీసుకుంటే శరీరానికి అద్భుత ప్రయోజనాలు కలిగిస్తాయి. ముఖ్యంగా రాత్రంతా పాలల్లో నానపెట్టిన ఎండు ద్రాక్ష ను ఉదయాన్నే పరగడుపున తీసుకోవాలి. అలా తీసుకుంటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. రోగనిరోధక శక్తి బలపడుతుంది. శక్తి స్థాయిలను కూడా మెరుగుపరుస్తుంది.
27
హిమో గ్లోబిన్..
ఎండుద్రాక్షలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది, ఇది హిమోగ్లోబిన్‌ను పెంచడంలో సహాయపడుతుంది. పాలతో కలిపి తీసుకుంటే శరీరంలో ఐరన్ శోషణ మరింత మెరుగుపడుతుంది.
37
ఎముకలను బలోపేతం చేస్తాయి..
పాలలో కాల్షియం, ఎండుద్రాక్షలో బోరాన్ ఉంటాయి. ఇవి ఎముకలను బలోపేతం చేసి ఆస్టియోపోరోసిస్‌ను నివారిస్తాయి.
నానబెట్టిన ఎండుద్రాక్షలో ఫైబర్ ఉంటుంది, ఇది మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యలను తగ్గిస్తుంది. పాలతో కలిపి తీసుకుంటే ప్రేగుల శుభ్రతకు సహాయపడుతుంది.
57
రోగనిరోధక శక్తి
ఎండుద్రాక్ష, పాలు రెండింటిలోనూ యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచి జలుబు, దగ్గు వంటి వ్యాధుల నుండి రక్షణ కల్పిస్తాయి.
67
ఎనర్జీ..
ఎండుద్రాక్షలో గ్లూకోజ్, ఫ్రక్టోజ్ వంటి సహజ చక్కెరలు ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తినిస్తాయి. పాలతో కలిపి తీసుకుంటే ఇది మరింత ప్రభావవంతంగా పనిచేస్తుంది.
77
ఎలా తీసుకోవాలి?
* ఒక గ్లాసు పాలలో 5-7 ఎండుద్రాక్షలను రాత్రంతా నానబెట్టండి. * ఉదయం ఖాళీ కడుపుతో పాలతో పాటు ఎండుద్రాక్ష తినండి. * క్రమం తప్పకుండా తీసుకుంటే, కొన్ని వారాల్లోనే మీరు మార్పును గమనించవచ్చు.
మీరు ఈ ఐదు సమస్యల్లో దేనితోనైనా బాధపడుతుంటే, పాలలో నానబెట్టిన ఎండుద్రాక్ష తినడం మీ ఆరోగ్యానికి సహజమైన, ప్రభావవంతమైన పరిష్కారం.