Health Tips: లోదుస్తులకు ఎక్స్‌పైరీ డేట్ ఉంటుందా? నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం!

Published : Jul 26, 2025, 02:16 PM IST

Inner wear: మనం ఉపయోగించే మందులు, ఆహార పదార్థాలు, నూనెలు, లోషన్ల వంటి వాటికి ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. గడువు దాటిన ఉత్పత్తులను వాడటం ఆరోగ్యానికి హానికరం. అలాగే లోదుస్తులకు (అండర్‌వేర్) కూడా గడువు తేదీ ఉంటుందా ? వైద్య నిపుణులు ఏం చెబుతున్నారు? 

PREV
15
లోదుస్తులకు ఎక్స్‌పైరీ డేట్ ?

లోదుస్తులు ప్రైవేట్ భాగాలకు రక్షణ ఇవ్వడమే కాకుండా వాటి ఆరోగ్యాన్ని కాపాడేందుకు కూడా ఉపయోగపడుతాయి.  కానీ,  చాలా మంది లోదుస్తుల గురించి పెద్దగా పట్టించుకోరు. వీటి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. లోదుస్తుల నాణ్యతపై అంతగా శ్రద్ధ చూపరు. లోదుస్తులను శుభ్రం చేయకుండానే రోజుల తరబడి ధరిస్తే  ఆరోగ్య సమస్యలు వస్తాయి. లోదుస్తులకు కూడా గడువు తేదీ (ఎక్స్‌పైర్ డేట్‌) ఉంటుందట. వాటిని  కొనుగోలు చేసినప్పుడు వాటిపై ప్రింట్ వేయకపోయినా.. ఎన్నిసార్లు ధరించాలి? ఎలా వినియోగించాలి ? అన్న దానికి ఓ లెక్క ఉందట. 

25
లోదుస్తులు ఎందుకు ధరిస్తాము?

లోదుస్తులు.. మన దైనందిన జీవితంలో పరిశుభ్రత, సౌలభ్యం, సురక్షిత వంటి విషయాల్లో కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి శరీరాన్ని బాక్టీరియా, చెమట, దుర్వాసన, అసౌకర్యం నుండి రక్షిస్తాయి. శుభ్రమైన లోదుస్తులు మూత్రనాళ ఇన్ఫెక్షన్లు (UTIs) వంటి ఆరోగ్య సమస్యలను నివారించడంలో సహాయపడతాయి. అంతేకాక, లోదుస్తులు ధరించడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వీటి ఉపయోగం వల్ల మానసిక ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ పరిశుభ్రమైన, సరిగ్గా సరిపోయే లోదుస్తులను వాడటం చాలా ముఖ్యం.

35
లోదుస్తులకు గడువు తేదీ ఉంటుందా?

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. లోదుస్తులకు నిర్దిష్టమైన గడువు తేదీ ఏదీ లేనప్పటికీ, ప్రతి 6 నెలలకు లేదా సంవత్సరానికి ఒకసారి లోదుస్తులను మార్చడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. దీని ద్వారా బాక్టీరియా, అలెర్జీలు, చర్మ సమస్యలు వంటి అనారోగ్యాలను నివారించవచ్చు. ఎంతకాలంగా వాడుతున్నామన్న దానికంటే.. అవి శుభ్రంగా ఉన్నాయా? ఏమైనా రంధ్రాలు వచ్చాయా ? దుర్వాసన వస్తోందా ? అన్నదే కీలకం. అలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే మార్చాలి.

45
లోదుస్తులను ఎప్పుడు మార్చుకోవాలి?

మీరు వాడుతున్న లోదుస్తులు వదులుగా మారినప్పుడు, చిరిగినప్పుడు లేదా చాలా పాతవిగా ఉన్నప్పుడు వెంటనే మార్చడం మంచిది. ఉతికిన తర్వాత కూడా దుర్వాసన వస్తే ఆ లోదుస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు. చిరిగిన లోదుస్తులు కీటకాలు, చర్మ వ్యాధులు లేదా బాక్టీరియల్ ఇన్ఫెక్షన్‌కి కారణమయ్యే ప్రమాదం ఉంది. ముఖ్యంగా లోదుస్తుల్లో రంధ్రాలు కనిపించినప్పుడు, అవి ఎలా ఏర్పడ్డాయో తెలుసుకోవడం అవసరం. వాటిని వాడడం వల్ల ఆరోగ్యపరంగా మంచిది కాదు. సాధారణంగా ప్రతి 3 నుండి 6 నెలలకోసారి లోదుస్తులను మార్చడం మంచిది.

55
గుర్తుంచుకోండి!

మీరు తువ్వాళ్లు, లోదుస్తువులు ప్రతి 6 నెలలకు ఒకసారి ఖచ్చితంగా మార్చాలి. ముఖం, శరీరానికి వేర్వేరు టవళ్లను ఉపయోగించాలి. ఇంట్లో ప్రతి వ్యక్తి తనకు తన సబ్బు, టవల్‌ వేరుగా వాడాలి, ఎందుకంటే, చర్మం ప్రతి ఒక్కరిది భిన్నంగా ఉంటుంది. ఈ సూచనలను పాటిస్తే, ఇన్ఫెక్షన్లను నివారించుకుని ఆరోగ్యంగా ఉండవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories