1. జీర్ణ సమస్యలు పెరుగుతాయి: లెమన్ టీలో ఆమ్లం ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో జీర్ణ ప్రక్రియ నెమ్మదిస్తుంది. అంతేకాకుండా గుండెల్లో మంట, వాపు, మలబద్ధకం, ఆమ్ల రిఫ్లక్స్ వంటి సమస్యలను కూడా కలిగిస్తుంది.
2. డీహైడ్రేషన్ కలుగుతుంది: లెమన్ టీలో ఉండే కెఫీన్ మూత్రవిసర్జన ను ప్రభావితం చేస్తుంది. అలాగే, నిమ్మకాయలో ఉండే ఆమ్లం జీర్ణవ్యవస్థను ప్రభావితం చేసి, డీహైడ్రేషన్‌కు దారితీయవచ్చు. దీనివల్ల శరీరంలో అనేక సమస్యలు వస్తాయి.
3. దంత ఆరోగ్యం: నిమ్మకాయలో ఉండే సిట్రిక్ యాసిడ్ దంతాల ఎనామిల్‌ను దెబ్బతీస్తుంది. నిమ్మకాయలు అధిక ఆమ్లత్వాన్ని కలిగి ఉంటాయి. ఇవి కాలక్రమేణా దంతాల ఎనామిల్‌ను కోతకు గురిచేస్తాయి. దీనివల్ల దంతాలు సున్నితంగా మారతాయి.