Health tips: చల్లటి నీళ్లు ఎక్కువగా తాగుతున్నారా? అయితే ఇవి కచ్చితంగా తెలుసుకోండి?

Published : May 08, 2025, 03:31 PM ISTUpdated : May 08, 2025, 03:33 PM IST

వేసవిలో ఎండ వేడి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి చల్లటి నీళ్లు తాగాలని అందరూ కోరుకుంటారు. అయితే చాలామంది వాటర్ లో ఐస్ వేసుకొని తాగడం లేదా బాగా చల్లటి వాటర్ తాగుతుంటారు. కానీ అది ఎంతమాత్రం మంచిది కాదంటున్నారు నిపుణులు. మరి చల్లటి నీరు తాగడం వల్ల వచ్చే సమస్యలెంటో ఇక్కడ చూద్దాం.

PREV
15
Health tips: చల్లటి నీళ్లు ఎక్కువగా తాగుతున్నారా? అయితే ఇవి కచ్చితంగా తెలుసుకోండి?

రోజు రోజుకు ఎండలు పెరిగిపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటింది. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. ఎండ వేడి, వేడి గాలుల కారణంగా శరీరంలో నీరు ఎక్కువగా ఆవిరవుతుంది. దానివల్ల దాహం కూడా పెరుగుతుంది. ఇలాంటి సమయంలో చల్లటి నీరు తాగాలని అనిపిస్తుంది. కానీ చల్లటి నీరు తాగడం ఆరోగ్యానికి మంచిదో.. కాదో.. ఇక్కడ తెలుసుకుందాం.

25
చల్లటి వాటర్ తాగితే?

వేసవిలో చాలా మంది వాటర్ లో ఐస్ వేసుకుని తాగడం సాధారణం. ఇది ఉపశమనాన్నిస్తుంది. కానీ ఐస్ నీరు తాగడం వల్ల ఆరోగ్యానికి తీవ్ర హాని కలుగుతుందని మీకు తెలుసా? ఈ అలవాటు క్రమంగా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని నిపుణులు చెబుతున్నారు.

35

ఆయుర్వేదం, ఆధునిక వైద్యం రెండూ అతిగా చల్లటి నీరు లేదా ఐస్ నీరు తాగడం వల్ల శరీరంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని చెబుతున్నాయి. నీరు నాలుగు డిగ్రీల కంటే ఎక్కువ చల్లగా ఉండకూడదు. శరీర సాధారణ ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్. అంటే 26 నుంచి 34 డిగ్రీల సెల్సియస్ మధ్య నీరు తాగడం మంచిది. ఒకవేళ మీరు విద్యార్థులైతే.. మంచి జ్ఞానాన్ని కోరుకుంటే, 8 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత ఉన్న నీటిని తాగాలి. ఇంట్లోనే ఉంటే 12 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత ఉన్న నీటిని తాగవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

45
శరీర ఉష్ణోగ్రతలో అసమతుల్యత:

మన శరీరం ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద పనిచేస్తుంది (బాహ్యంగా దాదాపు 37°C లేదా అంతర్గతంగా 30°C). మనం చాలా చల్లటి నీరు తాగినప్పుడు, ఆ నీటిని శరీర ఉష్ణోగ్రతకు తీసుకురావడానికి శరీరం ఎక్కువ శ్రమించాల్సి ఉంటుంది. ఇది శక్తిని వృథా చేస్తుంది.

55
చల్లని నీరు తాగడం వల్ల కలిగే నష్టాలు ఏమిటి?

ఐస్ వాటర్ జీర్ణ వ్యవస్థను నెమ్మదిస్తుంది. ఐస్ నీరు శరీర ఉష్ణోగ్రతను హఠాత్తుగా తగ్గిస్తుంది. ఎక్కువ చల్లటి నీరు గొంతు కణాలను దెబ్బతీస్తుంది. అతిగా ఐస్ నీరు తాగడం వల్ల రక్తనాళాలు కుంచించుకుపోతాయి. ఇది శరీరంలో రక్త ప్రసరణను నెమ్మదిస్తుంది. దీనివల్ల గుండెపోటు రావచ్చు. చాలా చల్లటి నీరు తాగడం లేదా ఐస్ నమలడం వల్ల దంతాల నాడులు సున్నితత్వాన్ని కోల్పోతాయి.

Read more Photos on
click me!

Recommended Stories