Health Tips: భోజనం చేసిన తర్వాత టీ తాగుతున్నారా? ఇవి కచ్చితంగా తెలుసుకోండి!

Published : Aug 05, 2025, 07:14 PM IST

మనలో చాలామందికి టీ తాగే అలవాటు ఉంటుంది. కొందరు ఉదయం, సాయంత్రం టీ తాగుతారు. మరికొందరు టైంతో సంబంధం లేకుండా ఎప్పుడు తాగాలి అనిపిస్తే అప్పుడు తాగుతారు. అయితే భోజనం తర్వాత టీ తాగడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదట. ఎందుకో ఇక్కడ తెలుసుకుందాం.  

PREV
15
తిన్న తర్వాత టీ తాగితే ఏమవుతుంది?

చాలామందికి తిన్న తర్వాత టీ తాగే అలవాటు ఉంటుంది. బ్లాక్ టీ, మసాలా టీ లాంటివి మధ్యాహ్నం లేదా రాత్రి భోజనం తర్వాత తాగుతుంటారు. కానీ మీకు ఇష్టమైన ఈ అలవాటు మంచి కంటే ఎక్కువ హాని చేస్తుందని మీకు తెలుసా? అవును, భోజనం తర్వాత టీ తాగడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకో వివరంగా తెలుసుకుందాం.  

25
జీర్ణ సమస్యలు

భోజనం చేసిన తర్వాత టీ తాగడం వల్ల మనం తిన్న ఆహారంలోని కొన్ని పోషకాలను శరీరం గ్రహించడంలో సమస్యలు ఏర్పడతాయి. ఫలితంగా జీర్ణ సమస్యలు పెరుగుతాయి. టీలో కెఫిన్ అధికంగా ఉండటం వల్ల గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి భోజనానికి ఒక గంట ముందు, ఒక గంట తర్వాత టీ తాగడం మానుకోవడం మంచిది.  

35
గుండె ఆరోగ్యంపై ప్రభావం

భోజనం చేసిన వెంటనే టీ తాగడం వల్ల ఎసిడిటీ లేదా గుండెల్లో మంట రావచ్చు. కాబట్టి ఈ అలవాటును వెంటనే మానేయడం మంచిది. ఈ అలవాటు కాలక్రమేణా గుండె పనితీరుపై ప్రభావం చూపించవచ్చు. హార్ట్ బీట్ కూడా పెరగవచ్చు.  

45
అధిక రక్తపోటు

భోజనం చేసిన తర్వాత టీ తాగడం వల్ల రక్తపోటు సమస్య వస్తుంది. టీలో ఉండే కెఫిన్ రక్తపోటును పెంచుతుంది. ఇప్పటికే అధిక రక్తపోటు సమస్య ఉన్నవారు భోజనం తర్వాత టీ తాగకపోవడమే మంచిది. 

55
ఐరన్ లోపం..

ఐరన్ లోపం ఉన్నవారు టీ తాగే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. టీలో టానిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది రక్తంలో ఐరన్‌ను నిరోధిస్తుంది. కాబట్టి భోజనం చేసిన వెంటనే టీ తాగడం మంచిదికాదు. ముఖ్యంగా గర్భిణులు, టీనేజర్లు లేదా శాఖాహారులకు దీర్ఘకాలంలో ఐరన్ లోపం రావచ్చు. 

Read more Photos on
click me!

Recommended Stories