తిన్న తర్వాత జస్ట్ 10 నిమిషాలు నడిచినా చాలు.. బరువు నుంచి షుగర్ తగ్గడం వరకు ఎన్ని లాభాలో

Published : Aug 24, 2025, 07:58 PM ISTUpdated : Aug 24, 2025, 08:00 PM IST

చాలా మంది తిన్న వెంటనే పడుకుంటుంటారు. కానీ మీరు తిన్న వెంటనే ఒక 10 నిమిషాలు నడిస్తే మాత్రం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

PREV
16
వాకింగ్

వాకింగ్ వల్ల బోలెడు లాభాలున్నాయి. అందుకే ప్రతిరోజూ వాకింగ్ చేయాలని ఆరోగ్య నిపుణులు, డాక్టర్లు సలహానిస్తుంటారు. ముఖ్యంగా తిన్న తర్వాత జస్ట్ 10 నిమిషాలు ఖచ్చితంగా నడవాలని చెప్తుంటారు. ఎందుకంటే దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు నియంత్రణలో ఉంటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

26
తిన్న తర్వాత నడవడం వల్ల కలిగే ప్రయోజనాలు

మెరుగైన జీర్ణక్రియ

తిన్న వెంటనే చాలా మంది కూర్చోవడమో, పడుకోవడమో చేస్తుంటారు. కానీ దీనివల్ల జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు వస్తాయి. అదే మీరు తిన్న తర్వాత 10 నిమిషాలు నడిచారంటే కడుపు కండరాలు సక్రియం అవుతాయి. దీంతో తిన్నది పేగుల్లో సులువుగా కదులుతుంది. దీంతో అజీర్ణం, మలబద్దకం, గ్యాస్ వంటి సమస్యలు రావు. నడక జీర్ణక్రియ మెరుగ్గా జరిగేందుకు సహాయపడుతుంది.

36
బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్

తిన్న తర్వాత నడవడం వల్ల షుగర్ పేషెంట్లకు మంచి మేలు జరుగుతుంది. ఇది బ్లడ్ షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేయడానికి బాగా సహాయపడుతుంది. వీళ్లు కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉన్న ఫుడ్ ను తిన్న తర్వాత షుగర్ పెరుగుతుంది. మీరు గనుక 10 నిమిషాలు నడిస్తే కండరాలు గ్లూకోజ్ ను ఉపయోగిస్తాయి. దీంతో షుగర్ ఫాస్ట్ గా పెరగదు. తిన్న తర్వాత 10 నిమిషాలు నడిస్తే టైప్ 2 డయాబెటీస్ వచ్చే ప్రమాదం తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

46
బరువు నియంత్రణ

బరువు తగ్గాలనుకునే, నియంత్రణలో ఉండాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. మీరు తిన్న తర్వాత నడిస్తే మెటబాలిజం పెరుగుతుంది. దీంతో మీ శరీరంలో ఉన్న అదనపు కేలరీలు బర్న్ అవుతాయి. దీనివల్ల మీరు బరువు పెరిగే అవకాశం తగ్గుతుంది.

గుండె మేలు

గుండె ఆరోగ్యంగా ఉండటానికి నడక ఎంతగానో సహాయపడుతుందది. మీరు రెగ్యులర్ గా నడిస్తే మీ గుండె ఆరోగ్యం బాగుంటుంది. ఇది మీ శరీరంలో రక్త ప్రసరణను పెంచి కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగకుండా చేస్తుంది. అలాగే అధిక రక్తపోటు సమస్య రాకుండా కాపాడుతుంది. దీంతో మీకు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

56
ఒత్తిడి తగ్గుతుంది

ఒత్తిడి ఎన్నో రోగాలకు దారితీస్తుంది. అయితే మీరు తిన్న తర్వాత కొద్దిసేపు నడిచినా స్ట్రెస్, యాంగ్జైటీ తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నడుస్తున్నప్పుడు నిశ్శబ్దం, స్వచ్ఛమైన గాలి మీ మనస్సును రిలాక్స్ చేస్తాయి. దీంతో హ్యాపీ హార్మోన్లు రిలీజ్ అవుతాయి. దీంతో మానసిక అలసట దూరమవుతుంది.

మెరుగైన నిద్ర

రాత్రిపూట సరిగ్గా నిద్రపట్టని వారు ఎంతో మంది ఉన్నారు. ఇలాంటి వారికి నడక ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మీరు రాత్రి భోజనం తర్వాత జస్ట్ 10 నిమిషాలు నడిచారంటే మీ శరీరం రిలాక్స్ అవుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. అలాగే జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది. దీంతో మీరు ప్రశాంతంగా నిద్రపోతారు.

66
వాకింగ్

అయితే తిన్న వెంటనే కాకుండా 10, 15 నిమిషాల తర్వాతే నడవండి. అలాగే ఫాస్ట్ ఫాస్ట్ గా కాకుండా నెమ్మదిగా నడవడానికి ప్రయత్నించండి. మీరు జస్ట్ 10 లేదా 15 నిమిషాలు నడిస్తే సరిపోతుంది. మీకు ఏదైనా అనారోగ్య సమస్య ఉంటే గనుక డాక్టర్ ను సంప్రదించిన తర్వాతే నడవండి.

Read more Photos on
click me!

Recommended Stories