బీట్రూట్ లో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు ఉన్నాయి. అందుకే బీట్రూన్ రెగ్యులర్ గా తీసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. రోజూ ఉదయాన్నే బీట్రూట్ జ్యూస్ తాగడం ద్వారా బెల్లీ ఫ్యాట్ తగ్గడమే కాదు.. చాలా రకాల సమస్యల నుంచి ఉపశమనం దక్కుతుంది.
బీట్రూట్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కేలరీలు తక్కువగా ఉంటాయి. బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల ఆకలి నియంత్రణలో ఉంటుంది. ఇందులోని బీటాలైన్లు, నైట్రేట్లు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. జ్ఞాపకశక్తి పెరగడానికి సహాయపడతాయి.
26
బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి..
బీట్రూట్ జ్యూస్.. బెల్లీ ఫ్యాట్ ని తగ్గించడానికి ప్రభావవంతంగా పనిచేస్తుంది. బీట్రూట్ లోని ఫైబర్.. గట్ హెల్త్ కు మంచిది. నీరు శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడానికి సహాయపడుతుంది.
36
రక్తపోటు తగ్గడానికి..
బీట్రూట్ బరువు తగ్గడానికి మాత్రమే కాదు.. మొత్తం ఆరోగ్యానికి కూడా మంచిది. ఇందులోని నైట్రేట్లు రక్తపోటును తగ్గిస్తాయి. కార్బోహైడ్రేట్లు, ఐరన్ శక్తినిస్తాయి. ఫైబర్ మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. బీటాలైన్లు కణాల నష్టం జరగకుండా కాపాడతాయి.
బీట్రూట్ జ్యూస్ ని రోజూ ఉదయం తాగచ్చు. అందులో క్యారెట్, ఆపిల్, లేదా అల్లం కూడా కలుపుకోవచ్చు. బీట్రూట్ ని సలాడ్ లేదా స్మూతీ రూపంలో కూడా తీసుకోవచ్చు.
56
ఇది గుర్తుంచుకోండి!
బీట్రూట్ సాధారణంగా సురక్షితమే అయినప్పటికీ.. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. బీట్రూట్ ని ఎక్కువగా తీసుకుంటే కొందరికి కిడ్నీలో రాళ్లు వచ్చే ప్రమాదం ఉంది. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, ముఖ్యంగా కిడ్నీ సమస్యలు ఉన్నవారు నిపుణుల సలహా తర్వాత తీసుకోవడం మంచిది.
66
బరువు నియంత్రణకు..
బరువు తగ్గడానికి.. బీట్రూట్ తో పాటు సరైన ఆహారం, వ్యాయామం, నిద్ర కూడా ముఖ్యం. ఆరోగ్యకరమైన జీవనశైలి ద్వారా ఈజీగా బరువు తగ్గవచ్చు.