విద్యార్థులు, ఉద్యోగులు సహా.. అన్ని రంగాల్లోని వ్యక్తులకు ఈ రోజుల్లో ఒత్తిడి విపరీతంగా పెరిగిపోతోంది. ఇది దీర్ఘకాలం కొనసాగితే అనేక రోగాల బారిన పడుుతుంటాం. ఈ ఒత్తిడి నివారించి, ఆరోగ్యం పెంచేందుకు ఆయుర్వేదం కొన్ని చిట్కాలు చెబుతోంది. మూలికలు, నూనెలు, ధ్యానం, యోగా వంటి సహజ నివారణలు ఇస్తుంది.
ఆయుర్వేదం ప్రాచీన భారతీయ వైద్య విధానం. వేల ఏళ్లుగా దీనిని ఆచరిస్తున్నారు. ఆరోగ్యం కోసం ఇందులో సహజసిద్ధమైన పద్ధతులను మాత్రమే వాడుతుంటారు. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అందుకే చాలామంది ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఆయుర్వేదం వైపు చూస్తున్నారు.
25
కొన్ని ఆయుర్వేద మూలికలు, నూనెలు, ధ్యానం, ప్రాణాయామం, యోగా ఒత్తిడిని తగ్గిస్తాయి. ఇవి శరీరం, మనస్సు, ఆత్మను బ్యాలెన్స్ చేస్తాయి. అందుకే ఆయుర్వేదం బాగా ఉపయోగపడుతుంది.
35
కొన్ని ఆయుర్వేద చిట్కాలు తెలుసుకుంటే, ఒత్తిడి నుంచి బయటపడొచ్చు.
తెల్ల ముస్లి ఒత్తిడిని తగ్గించి శక్తిని పెంచుతుంది. దీన్ని పొడిలా కూడా తీసుకోవచ్చు. తులసి ఆకులు ఒత్తిడిని తగ్గించి మనసుకు ప్రశాంతతనిస్తాయి. తులసి టీ తాగొచ్చు.
45
ఆవనూనె ఒత్తిడిని తగ్గిస్తుంది. దీన్ని నాభిలో వేసి మసాజ్ చేసుకోవచ్చు. యోగా, ప్రాణాయామం ఒత్తిడిని తగ్గిస్తాయి. యోగాలో చాలా ఆసనాలు ఉన్నాయి. ముందు తేలికైనవి ప్రయత్నించి, క్లిష్టమైన వాటిని క్రమంగా ఎంచుకోవచ్చు.
55
జటామాన్సి ప్రశాంతతనిచ్చి ఒత్తిడిని తగ్గిస్తుంది. దీన్ని పొడి చేసి వేడి నీటితో తాగొచ్చు.
బ్రాహ్మి మనస్సును ప్రశాంతంగా ఉంచి ఒత్తిడిని తగ్గిస్తుంది. బ్రాహ్మి టీ తాగొచ్చు. అశ్వగంధ కూడా మంచిదే.