అందంగా ఉండాలని ఎవరికి ఉండదు చెప్పండి? ముఖ్యంగా అమ్మాయిలు ఎప్పుడూ అందంగా ఉండాలని కోరుకుంటారు. దీనికోసం వాళ్లు మార్కెట్లో దొరికే ఖరీదైన క్రీములు వాడుతుంటారు. అయితే ఖరీదైన క్రీములు, సీరమ్ లు లేకుండానే ముఖం అందంగా, ముడతలు లేకుండా, యవ్వనంగా కనిపించేలా చేసే ఒక నూనె ఉంది. అదే కొబ్బరి నూనె. రాత్రిపూట కొబ్బరి నూనెను ముఖానికి రాయడం వల్ల కలిగే లాభాలెంటో ఇక్కడ తెలుసుకుందాం.
కొబ్బరి నూనె చర్మానికి వాడొచ్చా?
కొబ్బరినూనెలో చాలా మంచి గుణాలు ఉన్నాయి. కొబ్బరి నూనెను జుట్టుకు రాస్తే జుట్టు రాలడం తగ్గి, జుట్టును నల్లగా, మృదువుగా, మెరిసేలా చేస్తుంది. మొత్తానికి కొబ్బరి నూనె జుట్టు ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే చాలామంది కొబ్బరి నూనెను వాడుతుంటారు. నిజానికి కొబ్బరి నూనె జుట్టుకే కాదు చర్మానికి కూడా చాలా మంచిదట.
కొబ్బరి నూనె చర్మానికి రాస్తే?
నిపుణుల ప్రకారం, కొబ్బరి నూనె చర్మానికి రాయడం చాలా మంచిది. ముఖ్యంగా ఇది చర్మం పొడిబారకుండా కాపాడుతుంది. ఇంకా చర్మ సమస్యలను తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. కొబ్బరి నూనెను ముఖానికి ఎలా రాయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కొబ్బరి నూనెను ముఖానికి రాస్తే కలిగే లాభాలు?
చర్మ సమస్యలను తగ్గిస్తుంది :
కొబ్బరినూనె చర్మానికి రాయడం చాలా మంచిది. ఇది చర్మ సమస్యలను త్వరగా తగ్గించడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మం పొడిబారడం, మందంగా మారడం తగ్గిస్తాయి.
చర్మాన్ని తేమగా ఉంచుతుంది :
కొబ్బరి నూనె చర్మానికి మంచి పోషణను అందిస్తుంది. ఈ నూనెలో చాలా విటమిన్లు, నొప్పి నివారిణి, అలర్జీ నిరోధక, క్యాన్సర్ నిరోధక లక్షణాలు ఉన్నాయి. ఇవి చర్మానికి తేమనిస్తాయి. ముఖ్యంగా చలికాలంలో చర్మం పొడిబారకుండా కాపాడుతుంది.
వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తుంది :
కొబ్బరి నూనెలో ఉండే బ్యాక్టీరియా నిరోధక, అలర్జీ నిరోధక, తేమను ఇచ్చే గుణాలు చర్మ సమస్యలను తగ్గించి, కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి, చర్మం ముడతలు పడటం తగ్గిస్తుంది.
ముఖానికి కొబ్బరి నూనె ఎలా రాయాలి?
మీ ముఖం పొడిగా ఉంటే కొబ్బరి నూనె మీ చర్మానికి మంచి పోషణను ఇస్తుంది. ఇంకా ఇది ఒక మంచి మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. కొబ్బరి నూనెను కలబంద జెల్, బియ్యం నీరు, గ్లిసరిన్ లతో కలిపి క్రీమ్ లా తయారు చేసి వాడుకోవచ్చు. లేదంటే కొబ్బరి నూనెను మాత్రమే రాత్రి పడుకునే ముందు మీ ముఖానికి రాసి నెమ్మదిగా మసాజ్ చేయాలి.