Curd : చాలా మందికి అన్నం తినేటప్పుడు చివర్లో ఒక్క ముద్దైనా పెరుగుతో తినడం అలవాటు. పెరుగు రోజూ తినడం వల్ల ఆరోగ్యానికి మేలు. అయితే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలున్న వారు పెరుగు విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటంటే..
ఆయుర్వేదం ప్రకారం రాత్రి సమయంలో పెరుగు తినకూడదు. ఎందుకంటే.. రాత్రిళ్ళు జీర్ణక్రియ మందగిస్తుంది. జీర్ణం కావడం కష్టంగా మారుతుంది. దీని వల్ల గ్యాస్, జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు. అందుకే రాత్రి పెరుగు తినకూడదు.
26
ఈ కాలంలో పెరుగుకు దూరంగా..
చలికాలం, వర్షాకాలంలో శరీరం చల్లగా ఉంటుంది. జీర్ణశక్తి మందగిస్తుంది. పెరుగు చల్లని స్వభావం కలిగి ఉండటంతో జలుబు, దగ్గు లాంటి సమస్యలు రావచ్చు. కాబట్టి ఈ కాలంలో పెరుగు తినకపోవడం ఉత్తమం. తినాలంటే మిరియాలు, అల్లం, జీలకర్ర వంటి తాపగుణాలు కలిగిన పదార్థాలతో కలిపి తినవచ్చు.
36
జీర్ణ సమస్యలు ఉన్నప్పుడు
అజీర్ణం, మలబద్ధకం, విరేచనాలు వంటి జీర్ణ సమస్యల సమయంలో పెరుగు తినకూడదు. ఇది సులభంగా జీర్ణం కాక, జీర్ణవ్యవస్థపై ఒత్తిడి పెరుగుతుంది. ఈ సమయంలో తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. మజ్జిగ లేదా అల్లం నీరు వంటి పానీయాలు మంచివి.
చర్మ సమస్యలు, దురద, ఎగ్జిమా వంటి సమస్యలు ఉన్నవారు పెరుగు తినకూడదు. పెరుగులోని కొన్ని పదార్థాలు ఈ సమస్యలను మరింత తీవ్రం చేస్తాయి. పాల ఉత్పత్తుల వల్ల అలెర్జీ వచ్చేవారు పెరుగు తినకపోవడమే మంచిది.
56
రక్త సంబంధిత సమస్యలు
ఆయుర్వేదం ప్రకారం.. రక్తస్రావం లేదా ఇతర రక్త సంబంధిత సమస్యలు ఉన్నవారు పెరుగు తినకూడదు. ఎందుకంటే పెరుగు రక్తాన్ని గడ్డకట్టే స్వభావం కలిగి ఉందని కొన్ని ఆయుర్వేద గ్రంథాలు పేర్కొంటున్నాయి. ఇది ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు.
66
పెరుగుకు బదులుగా
పెరుగుకు మంచి ప్రత్యామ్నాయం మజ్జిగ. మజ్జిగ పెరుగు కంటే తేలికగా జీర్ణమవుతుంది, శరీరానికి చలువ చేస్తుంది. ఉప్పు, జీలకర్ర, అల్లం, కరివేపాకుతో కలిపిన మజ్జిగ జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. పెరుగు తినాలంటే మధ్యాహ్నం మాత్రమే తినాలి. ఉదయం గానీ, రాత్రి వేళల్లో పెరుగు తింటే.. పెరుగులో కొంచెం నీరు కలిపి తినడం మంచిది. అలాగే.. పండ్లతో పాటు పెరుగు తినకూడదు. ఇది జీర్ణక్రియను కష్టతరం చేస్తుంది.