Anti Aging: 100 ఏళ్లు బతికితే అద్భుతం అనకుంటాం. కానీ త్వరలోనే మనిషి 150 ఏళ్ల బతకడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఇన్నేళ్లు బతకడం నిజంగానే సాధ్యమా.? దీనికి ఎలాంటి అంశాలు దోహదపడనున్నాయి.? ఇప్పుడు తెలుసుకుందాం.
కొంతమంది శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం, మనిషి గరిష్ట జీవన కాలం 120 నుండి 150 సంవత్సరాలకి పెరగనుందని అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రముఖ సైన్స్ జర్నల్ నేచర్ దీనిని ఇప్పటికీ “ఊహాత్మక ఆలోచన”గా పేర్కొంది. అంటే, ఇది పూర్తిగా అసాధ్యం కాదు కానీ ఇంకా నిర్ధారితమైన విషయం కూడా కాదని అర్థం.
25
ఎపిజెనెటిక్ క్లాక్ – వయస్సు కొలిచే కొత్త పద్ధతి
శాస్త్రవేత్త స్టీవ్ హోర్వాత్ రూపొందించిన “ఎపిజెనెటిక్ క్లాక్” అనే పద్ధతి ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఇది మన శరీరంలోని DNAలో జరిగే “మెథిలేషన్” మార్పులను చూసి అసలు శరీర వయస్సును అంచనా వేస్తుంది. సాధారణంగా మన వయస్సు సంవత్సరాల ద్వారా (క్రోనోలాజికల్ ఏజ్) కొలుస్తాం, కానీ ఈ పద్ధతి శరీర అసలు స్థితిని (బయాలజికల్ ఏజ్) చెబుతుంది. ఇది భవిష్యత్తులో యాంటీ-ఏజింగ్ పరిశోధనలకు మార్గం చూపే అవకాశం ఉంది.
35
జీవితం పెరగడం కాదు… ఆరోగ్యంగా జీవించడం ముఖ్యం
ఇప్పటికే మెడికల్ టెక్నాలజీ వల్ల మనుషుల జీవితకాలం పెరిగింది. డయాలిసిస్, వెంటిలేటర్లు, పేస్‌మేకర్లు వంటి చికిత్సలు ప్రాణాలను నిలబెడుతున్నాయి. కానీ ఇక్కడే ఒక ముఖ్యమైన సమస్య కూడా ఉంది. జీవితం కాలం అయితే పెరుగుతోంది కానీ కానీ ఆరోగ్యంగా ఉండే కాలం (healthspan) తగ్గుతోంది. కొంతమంది వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. “జీవితాన్ని పొడిగించడం మాత్రమే కాదు, ఆరోగ్యంగా ఉండే సంవత్సరాలను పెంచడం ముఖ్య లక్ష్యం.” అని అంటున్నారు.
నిపుణుల ప్రకారం, జీవితం ఎంతకాలం ఉంటుందో ఒకే అంశం నిర్ణయించదు. DNA మెథిలేషన్ ఒక భాగమే. దీంతోపాటు మరికొన్ని ముఖ్యమైన అంశాలు కూడా ఉన్నాయి. వీటిలో ప్రధానమైనవి.. ఆహారం (nutrients), గట్ హెల్త్, ఒత్తిడి, నిద్ర, కాలుష్యం, జీవనశైలి. ఈ అన్ని అంశాలు కలిపి మన ఆరోగ్యంతో పాటు జీవితకాలాన్ని ప్రభావితం చేస్తాయి.
55
150 సంవత్సరాల జీవితం కోసం ఇంకా ఏమి కావాలి?
శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం, 150 సంవత్సరాల జీవితం సాధ్యం కావాలంటే ఇంకా పెద్ద మార్పులు అవసరం. జీన్ థెరపీ (Gene Therapy), రీజెనరేటివ్ మెడిసిన్ (Regenerative Medicine), సెల్ రిపేర్ టెక్నాలజీ. ఇవి పూర్తిగా అభివృద్ధి చెందితే మాత్రమే మనిషి శరీరం ఎక్కువకాలం ఆరోగ్యంగా ఉండగలడు. మొత్తం మీద మనిషి 150 సంవత్సరాలు జీవించడం ఇప్పటికీ నిర్ధారించని విషయం. కానీ పరిశోధనలు ఒక విషయం మాత్రం స్పష్టం చేస్తున్నాయి. ఎక్కువ కాలం జీవించడం కంటే, ఆరోగ్యంగా జీవించడం ముఖ్యం. జీవితం పొడవు కంటే జీవన నాణ్యత ముఖ్యమైందని అంటున్నారు.