Alcohol: నిమ్మ‌కాయ చ‌ప్ప‌రిస్తే తాగిన మ‌త్తు దిగుతుందా.? అస‌లేంటీ లాజిక్

Published : Feb 17, 2026, 03:12 PM IST

Alcohol: ఆల్క‌హాల్ తీసుకుంటే మ‌త్తు వ‌స్తుంద‌ని తెలిసిందే. అయితే తాగిన తర్వాత నిమ్మకాయ చప్పరిస్తే నశా వెంటనే తగ్గిపోతుందనే నమ్మకం చాలా మందిలో ఉంది. అయితే ఇందులో ఎంత వ‌ర‌కు నిజం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
శరీరంలో ఆల్కహాల్ ఎలా పనిచేస్తుంది?

సాధార‌ణంగా ఆల్క‌హాల్ తాగిన వెంట‌నే అది నేరుగా రక్తంలోకి చేరుతుంది. తర్వాత లివర్ (కాలేయం) దాన్ని విడదీసి అసిటాల్డిహైడ్ అనే హానికర పదార్థంగా మార్చుతుంది. ఇది టాక్సిక్ కంపౌండ్. లివర్ ఒక స్థిరమైన వేగంతోనే ఆల్కహాల్‌ను ప్రాసెస్ చేస్తుంది. ఈ ప్రక్రియను ఎలాంటి ఆహారం లేదా పానీయం వేగంగా మార్చలేవు. అంటే నిమ్మకాయ ఎంత పులుపుగా ఉన్నా రక్తంలోని ఆల్కహాల్ స్థాయిని వెంటనే త‌గ్గించ‌దు. మ‌త్తు దిగాలంటే గడవడమే ఒక్కటే పరిష్కారం.

25
నిమ్మకాయతో ఉప‌యోగం లేదా అంటే

నిమ్మకాయలో విటమిన్ Cతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. మందు తాగినప్పుడు శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరుగుతుంది. ఇది లివర్ కణాలకు నష్టం కలిగించవచ్చు. విటమిన్ C శరీరంలోని డిటాక్స్ ప్రక్రియకు సహాయపడుతుంది. లివర్ పనితీరును కొంతమేరకు మెరుగుపరచడంలో దోహదం చేస్తుంది. అయితే ఇది నశాను వెంటనే తగ్గించదు. కానీ హ్యాంగోవర్ నుంచి కోలుకోవడంలో సహాయపడవచ్చు.

35
డీహైడ్రేషన్ తగ్గించడంలో

ఆల్క‌హాల్ ఒక డయూరెటిక్. అంటే ఇది ఎక్కువ మూత్ర విసర్జనకు కారణమవుతుంది. దీంతో శరీరంలో నీరు తగ్గి డీహైడ్రేషన్ కలుగుతుంది. డీహైడ్రేషన్ వల్లే తలనొప్పి, అలసట వంటి హ్యాంగోవర్ లక్షణాలు వస్తాయి. నిమ్మరసం కలిపిన నీరు తాగితే శరీరానికి మళ్లీ ద్రవాలు అందుతాయి. ఇది కొంత ఉపశమనం ఇచ్చే అవ‌కాశాలు ఉంటాయి.

45
పులుపు రుచి వల్ల తాత్కాలిక అలర్ట్‌నెస్

నిమ్మకాయ పులుపు రుచి నాడీ వ్యవస్థను ఉత్తేజితం చేస్తుంది. ఒక్కసారిగా మెలకువ వ‌చ్చిన‌ట్లు అనిపిస్తుంది. కొంతసేపు అలసట తగ్గినట్టు భావ‌న క‌లుగుతుంది. కానీ ఇది తాత్కాలిక ప్రభావం మాత్రమే. రక్తంలోని ఆల్కహాల్ స్థాయి మాత్రం తగ్గదు.

55
నిజం ఏంటంటే.?

నిమ్మకాయ తింటే నశా వెంటనే తగ్గిపోతుందనేది ఒక అపోహ మాత్రమే. ఆల్కహాల్ శరీరం నుంచి బయటకు వెళ్లడానికి సమయం ప‌డుతుంది. అయితే నిమ్మరసం తాగడం వల్ల హ్యాంగోవర్ లక్షణాలు కొంత తగ్గవచ్చు. కానీ ఇది పూర్తి పరిష్కారం కాదు. కాబ‌ట్టి వీలైనంత వ‌ర‌కు ఆల్క‌హాల్‌కు దూరంగా ఉండ‌డ‌మే మంచిది. ఒక‌వేళ హ్యాంగోవ‌ర్ ఉంటే నీరు తాగ‌డం ఉత్త‌మ మార్గం.

గమనిక: ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో వైద్యుల సూచనలు పాటించడం మంచిది.

Read more Photos on
click me!

Recommended Stories