Weight Loss: త్వరగా బరువు తగ్గాలా ? అయితే ఈ ప్రోటీన్ ఫుడ్స్ తీసుకోండి

Published : Jul 20, 2025, 04:37 PM IST

Weight Loss: బరువు తగ్గాలంటే కేవలం తక్కువ తినడం సరిపోదు. సరైన పోషకాహారం తీసుకోవడమే కీలకం. ముఖ్యంగా ప్రోటీన్ అధికంగా ఉన్న ఆహారం శరీరాన్ని బలంగా ఉంచడమే కాకుండా  ఆకలిని కూడా నియంత్రిస్తుంది. ఇంతకీ ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఆహారం గురించి తెలుసుకుందాం. 

PREV
18
ప్రోటీన్ ఫుడ్

బరువు తగ్గడానికి సహాయపడే ప్రోటీన్ అధికంగా ఆహారాలు. ఈ ఆహారాలు శరీరానికి అవసరమైన ప్రోటీన్‌ను అందించడమే కాకుండా, ఆకలిని తగ్గించి కొవ్వును కరిగించడంలో సహాయపడతాయి. ఇంతకీ ఆ ఆహారపదార్థాలేంటీ? 

28
బాదం

బాదంలో ప్రోటీన్, ఫైబర్, విటమిన్ E, మెగ్నీషియం లాంటి పోషకాలు ఉంటాయి. ఐదు బాదాల్లో సుమారు 1.5 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇవి ఆకలి తగ్గించి బరువు తగ్గడంలో సహాయపడతాయి.

38
సోయా బీన్

100 గ్రాముల సోయాబీన్‌లో సుమారు 36 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇందులో కాల్షియం కూడా పుష్కలంగా ఉండటం వల్ల ఇది ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే బరువు తగ్గడంలో సహాయపడుతాయి.

48
పల్లీలు

100 గ్రాముల పల్లీల్లో సుమారు 25 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇవి శరీరానికి అవసరమైన ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా కలిగి ఉండటంతో బరువు తగ్గే డైట్‌లో చేర్చుకోవచ్చు.

58
గుడ్డు

ఒక గుడ్డులో సుమారు 6 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. దీంట్లో కాల్షియం కూడా ఉండటంతో ఇది కండరాల పెరుగుదలకు, ఎముకల ఆరోగ్యానికి మంచిది. బరువు తగ్గడానికి గుడ్డు మంచి ఎంపిక.  

68
గుమ్మడి గింజలు

100 గ్రాముల గుమ్మడి గింజల్లో సుమారు 19 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇవి ఆరోగ్యకరమైన కొవ్వులు, మాగ్నీషియం, జింక్ వంటి మినరల్స్‌ను కూడా అందిస్తాయి. బరువు తగ్గాలని భావించే వారు తమ డైట్‌లో గుమ్మడి గింజలను చేర్చుకోవచ్చు. 

78
పెరుగు

100 గ్రాముల పెరుగులో 11 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. పెరుగును డైట్‌లో చేర్చుకోవచ్చు.

88
ఓట్స్

100 గ్రాముల ఓట్స్‌లో 26 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ప్రోటీన్ తక్కువగా ఉన్నవారికి ఓట్స్ మంచి ఆహారం.

Read more Photos on
click me!

Recommended Stories