Stomach Pain: ఇవి ఫాలో అయితే చాలు.. కడుపు నొప్పిని ఈజీగా తగ్గించుకోవచ్చు!

ప్రస్తుతం చాలామంది ఎదుర్కొనే ఆరోగ్య సమస్యల్లో కడుపు నొప్పి ఒకటి. గజిబిజీ లైఫ్ స్టైల్, బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్, ఇతర కారణాల వల్ల కడుపు నొప్పి రావడం సహజం. కడుపు నొప్పి వస్తే ఏ పనిమీద సరిగ్గా శ్రద్ధ పెట్టలేము. ఒక్క దగ్గర కూర్చోలేము. నిల్చోలేము. అందులోనూ వేసవిలో ఈ సమస్య ఇంకా ఎక్కువగా ఉంటుంది. మరి కడుపు నొప్పి నుంచి ఈజీగా ఎలా ఉపశమనం పొందాలో ఇక్కడ తెలుసుకుందాం.

5 ways to get rid of a stomach ache during summer in telugu KVG

వేసవిలో చాలా మందికి ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి వంటివి. కడుపు నొప్పికి చాలా కారణాలు ఉంటాయి. వాటిలో ముఖ్యమైనవి ఇక్కడ చూద్దాం.

కడుపు నొప్పికి కారణాలు

వేసవిలో నీళ్లు తక్కువ తాగడం, ఆహారపు అలవాట్లు మారడం వల్ల కడుపు సమస్యలు వస్తుంటాయి. అధిక వేడి వల్ల శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది. వేసవిలో తగిన ఆహారం తీసుకోకపోతే కడుపులో ఇబ్బందులు తలెత్తుతాయి. వీటిని ఎలా తగ్గించుకోవాలో ఇక్కడ చూద్దాం.


కడుపు నొప్పి తగ్గించే చిట్కాలు

1. నీళ్లు ఎక్కువగా తాగండి: 
వేసవిలో నీళ్లు ఎక్కువగా తాగాలి. రోజుకి 10 గ్లాసుల నీళ్లు తాగడం చాలా ముఖ్యం.

2. వేసవి ఆహారాలు: 
వేసవిలో గంజి, సలాడ్ వంటివి తినండి. కారం, నూనె ఎక్కువగా ఉన్న ఆహారాలు తినకండి.

3. శుభ్రమైన ఆహారం:

వేసవిలో బాక్టీరియా, వైరస్‌లు త్వరగా వ్యాప్తి చెందుతాయి. కాబట్టి శుభ్రమైన ఆహారం తినడం చాలా ముఖ్యం.

4. బయట ఆహారం తినకండి!  
వేసవిలో బయట ఆహారం తినకపోవడమే మంచిది. ఎందుకంటే వేడి వల్ల జీర్ణక్రియ బలహీనంగా ఉంటుంది.

5. మానసిక ఒత్తిడి: 
వేసవిలో కడుపు ఆరోగ్యానికి మానసిక ఒత్తిడి లేకుండా ఉండటం ముఖ్యం. యోగా, ధ్యానం, వ్యాయామం వంటివి చేయండి

Latest Videos

vuukle one pixel image
click me!