Stress Effect: ఒత్తిడి ఎక్కువైతే ముఖంపై ఎలాంటి ప్రభావం పడుతుందో తెలుసా?

Published : Apr 17, 2025, 03:57 PM IST

ముఖం అన్ని భావాలకు అద్దం పడుతుంది. ఒక వ్యక్తి బాధగా ఉన్నా, సంతోషంగా ఉన్నా.. లేదా కోపంగా ఉన్నా.. ముఖంలో ఇట్టే తెలిసిపోతుంటుంది. ముఖ్యంగా మనసు బాగోలేక ఒత్తిడికి గురైతే.. ముఖంలో చాలా రకాల లక్షణాలు కనిపిస్తాయి. ఒత్తిడి వల్ల ముఖంపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇక్కడ తెలుసుకుందాం.

PREV
15
Stress Effect: ఒత్తిడి ఎక్కువైతే ముఖంపై ఎలాంటి ప్రభావం పడుతుందో తెలుసా?

ముఖం అన్ని భావాలను బయటకు చూపిస్తుంది. మనం సంతోషంగా ఉంటే ముఖం చూడటానికి అందంగా కనిపిస్తుంది. కాంతివంతంగా ఉంటుంది. ఒకవేళ మనసులో ఏదైనా బాధ ఉంటే ముఖంలో నవ్వు రాదు. ఫేస్ డల్ గా కనిపిస్తుంది. మనసు బాగోలేకపోవడం ఇప్పుడు చాలామందికి సాధారణమైన సమస్య. అలాంటి టైంలో ముఖంపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇక్కడ తెలుసుకుందాం.

 

25
హైపర్ పిగ్మెంటేషన్:

ఒత్తిడి ఎక్కువైతే.. మెలనిన్ ఉత్పత్తి పెరుగుతుంది. దీనివల్ల ముఖంపై నల్ల మచ్చలు వస్తాయి. మందులు ఎక్కువ రోజులు వాడినా కూడా ఈ సమస్య వస్తుంది. కాబట్టి ఒత్తిడిని సాధ్యమైనంత వరకు తగ్గించుకోవడం మంచిది.

35
మొటిమలు

సాధారణంగా హార్మోన్ల సమస్య వల్ల మొటిమలు వస్తుంటాయి. నెలసరి, గర్భం, మెనోపాజ్, ఒత్తిడి వంటి కారణాల వల్ల స్త్రీల శరీరంలో హార్మోన్ల మార్పులు జరిగి మొటిమలు వస్తాయి. అంతేకాదు ఒత్తిడి పెరిగినప్పుడు ఫేస్ డల్ గా మారుతుంది.

 

45
కళ్ల కింద వాపు

ఒత్తిడి ఎక్కువైతే కళ్ల కింద వాపు, ముడతలు కూడా వస్తాయని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి. చర్మం పొడిబారడం, కాంతీ హీనంగా మారడం వంటి సమస్యలు ఎదురవుతాయని నిపుణులు చెబుతున్నారు.

55
ఒత్తిడి తగ్గించి.. ముఖానికి కాంతి తేవడం ఎలా?

- ధ్యానం చేయండి

- ప్రకృతిలో కొంత సమయం గడపండి. 

- తేలికైన వ్యాయామం చేయండి.

- ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి.

- రోజూ 7-8 గంటలు నిద్రపోవాలి.  

- రోజూ తగినంత నీరు తాగాలి.

Read more Photos on
click me!

Recommended Stories