మెంతుల్లో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని రాత్రంతా నీటిలో నానబెట్టి, మరుసటి రోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగడం మంచిదని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా 11 రోజుల పాటు వరుసగా ఈ నీళ్లు తాగితే శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో చూద్దాం.
మెంతులలో కరిగే ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. నిపుణుల ప్రకారం 11 రోజుల పాటు క్రమ తప్పకుండా మెంతుల నీళ్లను తాగితే శరీరంలో స్పష్టమైన మార్పులు కనిపిస్తాయి. మెంతుల నీళ్లు జీర్ణ వ్యవస్థను సానుకూలంగా ప్రభావితం చేస్తాయి. మెంతులలోని ఫైబర్.. గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
26
షుగర్ లెవెల్స్ పై ప్రభావం
బ్లెడ్ షుగర్ స్థాయిలపై కూడా మెంతుల నీళ్లు సానుకూల ప్రభావం చూపిస్తాయి. ఇవి రక్తంలో చక్కెర శోషణను నెమ్మది చేస్తాయి. ఇన్సులిన్ పనితీరును మెరుగుపరుస్తాయి. ముఖ్యంగా వరుసగా 11 రోజులపాటు మెంతుల నీళ్లు తాగిన చాలామందిలో షుగర్ లెవెల్స్ స్థిరంగా కంట్రోల్లో ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఆల్రెడీ షుగర్ వ్యాధికి మందులు వాడుతున్నవారు డాక్టర్ సలహా తర్వాత మాత్రమే ఈ డ్రింక్ తాగాలని సూచిస్తున్నారు.
36
గుండె ఆరోగ్యానికి..
కొలెస్ట్రాల్ తగ్గించడంలోనూ మెంతుల నీళ్లు సహాయపడతాయి. ఇందులోని ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని నిపుణులు చెబుతున్నారు. 11 రోజులు వరుసగా మెంతుల నీళ్లు తాగినవారిలో ఈ మార్పు స్పష్టంగా కనిపించిందని వివరస్తున్నారు.
మెంతుల నీళ్లు.. శరీరంలో మంట, వాపు, కీళ్ల నొప్పులను తగ్గించడంలో సహాయపడతాయి. మెంతుల్లో సహజంగా ఉండే యాంటీ‑ఇన్‌ఫ్లమేటరీ గుణాలు జీర్ణవ్యవస్థను శాంతింపజేసి, గ్యాస్, అసిడిటీ వల్ల వచ్చే మంటను తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే ఇవి శరీరంలో ఉన్న అదనపు వేడిని తగ్గించి, మూత్రవిసర్జనను మెరుగుపరచడం ద్వారా వాపు తగ్గడానికి తోడ్పడతాయి.
56
తక్షణ శక్తి
మెంతుల నీళ్లు శరీరానికి సహజమైన శక్తి, హైడ్రేషన్ అందించడంలో సహాయపడతాయి. మెంతులలోని విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో శక్తి ఉత్పత్తిని ప్రోత్సహించి, అలసటను తగ్గిస్తాయి. అలాగే ఈ నీళ్లు శరీరాన్ని ఉత్తేజితం చేసి, హైడ్రేటెడ్‌గా ఉంచడంలో సహాయపడతాయి.
66
గమనిక
మెంతుల నీళ్లు ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ.. డయాబెటిస్ ఉన్నవారు, ప్రెగ్నెంట్స్, థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు లేదా ప్రత్యేకమైన మందులు వాడుతున్నవారు డాక్టర్ సలహా తీసుకున్న తర్వాతే మెంతుల నీళ్లను తాగడం మంచిది.