Lemon Water: 7 రోజుల పాటు ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీళ్లు తాగితే కలిగే 5 లాభాలు ఇవే!

Published : Feb 04, 2026, 03:22 PM IST

చాలామంది ఉదయం లేవగానే టీ, కాఫీలు తాగుతుంటారు. కానీ గోరువెచ్చని నిమ్మకాయ నీళ్లతో రోజును ప్రారంభిస్తే శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో మీకు తెలుసా? కేవలం 7 రోజులు ఈ అలవాటును పాటిస్తే.. అద్భుతమైన లాభాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. అవేంటో చూద్దాం. 

PREV
16
Lemon Water Benefits

నిపుణుల ప్రకారం.. ప్రతి రోజు ఉదయం ఖాళీ కడుపుతో గోరువెచ్చని నిమ్మకాయ నీళ్లు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రస్తుత జీవన శైలి, అసమతుల్య ఆహారం, వ్యాయామ లోపం వల్ల శరీరంలో పేరుకుపోతున్న సమస్యలకు ఇది చక్కని పరిష్కారం. ముఖ్యంగా 7 రోజుల పాటు క్రమం తప్పకుండా గోరువెచ్చని నిమ్మకాయ నీళ్లు తాగితే శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

26
జీర్ణవ్యవస్థపై ప్రభావం

నిమ్మకాయలో ఉండే సిట్రిక్ యాసిడ్ జీర్ణ రసాల ఉత్పత్తిని ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. ఉదయం గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగడం వల్ల మలబద్ధకం, అజీర్ణం, పొట్ట ఉబ్బరం వంటి సమస్యలు క్రమంగా తగ్గుతాయి. నిపుణుల ప్రకారం లెమెన్ వాటర్ పేగుల కదలికలను మెరుగుపరచి శరీరంలోని మలినాలను బయటకు పంపే ప్రక్రియకు తోడ్పడుతుంది. కేవలం వారం రోజుల్లోనే మంచి ఫలితాలు చూడవచ్చు.

36
కణాలకు శక్తి

అలాగే రాత్రి నిద్ర తర్వాత శరీరం కొంత మేరకు డీహైడ్రేషన్‌కు గురవుతుంది. గోరువెచ్చని నిమ్మకాయ నీళ్లు తాగడం ద్వారా శరీరానికి తక్షణ హైడ్రేషన్ లభిస్తుంది. నిమ్మకాయలో ఉండే పొటాషియం, విటమిన్ C వంటి పోషకాలు కణాలకు శక్తినిచ్చి అలసటను తగ్గిస్తాయి. నిపుణుల ప్రకారం, ఇది రోజు మొత్తం ఉత్సాహంగా ఉండేందుకు సహాయపడుతుంది. ముఖ్యంగా ఉదయపు అలసట, తలనొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి.

46
రోగ నిరోధక శక్తి

నిమ్మకాయ విటమిన్ C కి మంచి మూలం. ఇది శరీరంలోని ఇమ్యూన్ సిస్టమ్‌ను బలోపేతం చేసి, సాధారణ జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తుంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం రోజూ విటమిన్ C తీసుకోవడం వల్ల వ్యాధులను ఎదుర్కొనే సామర్థ్యం బలంగా పెరుగుతుంది.

56
చర్మ కాంతికి..

శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోతే దాని ప్రభావం ముందుగా చర్మంపై కనిపిస్తుంది. గోరువెచ్చని నిమ్మకాయ నీళ్లు శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపడంలో సహాయపడతాయి. దీనివల్ల మొటిమలు, నలుపుదనం, చర్మం డల్ గా కనిపించడం వంటి సమస్యలు క్రమంగా తగ్గుతాయి. విటమిన్ C కొల్లాజెన్ ఉత్పత్తికి తోడ్పడి, చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది.

66
బరువు తగ్గడానికి

గోరువెచ్చని నిమ్మకాయ నీళ్లు తాగడం వల్ల మెటబాలిజం కొంత మేర వేగవంతమవుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల ఆకలి నియంత్రణ, అనవసరంగా తినాలనే కోరిక తగ్గుతాయని చెబుతున్నారు. నిపుణుల ప్రకారం ఉదయం పరగడుపున లెమెన్ వాటర్ తాగడం వల్ల పొట్ట నిండిన భావన కలిగి, జంక్ ఫుడ్ వైపు ఆకర్షణ తగ్గే అవకాశం ఉంటుంది. సరైన ఆహార నియమాలు, వ్యాయామంతో కలిపి ఈ అలవాటు పాటిస్తే ఈజీగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది. 

Read more Photos on
click me!

Recommended Stories