Dog Bite: కుక్క కరిచిన వెంటనే ఇలా చేస్తే.. ప్రాణాలకు ప్రమాదం ఉండదు..!

Published : Jul 11, 2025, 12:21 PM IST

రేబిస్ అనేది వైరల్ వ్యాధి. ఇది సాధారణంగా కుక్క, పిల్లి, నక్క లేదా ఏదైనా ఇతర అడవి జంతువులు కరవడం వల్ల వస్తుంది.

PREV
14
dog bite

రోడ్డు మీద ఎక్కడ చూసినా వీధి కుక్కలు కుప్పలు కుప్పలుగా కనపడుతూనే ఉంటాయి. అవి ఎప్పుడు ఎలా ఎటాక్ చేస్తాయో అనే భయం చాలా మందిలో ఉంటుంది. ఇక కుక్క కాటు వేస్తే.. రేబిస్ వ్యధి వస్తుందని, ఈ వ్యాధి వస్తే మరణం ఖాయం అనే భావన చాలా మందిలో ఉంటుంది. ఇది నిజం కూడా. రీసెంట్ గా ఓ కబడ్డీ ఆటగాడు రేబిస్ వ్యధితో ఏకంగా ప్రాణాలు కూడా కోల్పోయాడు.

24
కుక్క కరిచిన వెంటనే ఏం చేయాలి?

ఒక్కసారి రేబిస్ వచ్చింది అంటే.. దానికి చికిత్స లేదని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ.. కుక్క కాటు వేసిన వెంటనే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే.. కచ్చితంగా ఎలాంటి భయం ఉండదు. ఈ విషయాన్ని ఎయిమ్స్ కి చెందిన డాక్టర్ ప్రియాంక్ సెహ్రావత్ స్వయంగా తెలియజేశారు.

34
రేబిస్ ఎలా వస్తుంది?

రేబిస్ అనేది వైరల్ వ్యాధి. ఇది సాధారణంగా కుక్క, పిల్లి, నక్క లేదా ఏదైనా ఇతర అడవి జంతువులు కరవడం వల్ల వస్తుంది. ఈ వైరస్ శరీరంలోని గాయం ద్వారా నెమ్మదిగా నాడీ వ్యవస్థ ద్వారా మెదడుకు చేరుకుంటుంది. కేంద్ర నాడీ వ్యవస్థపై దాడి చేస్తుంది. వైరస్ దాడి చేసినప్పుడు దాని లక్షణాలు కనిపించడం ప్రారంభిస్తాయి.

44
కుక్క కరిచిన వెంటనే చేయాల్సింది ఇదే...

కుక్క కరిచిన వెంటనే భయపడకూడదు. ముందుగా గాయాన్ని 10 నుంచి 15 నిమిషాల పాటు పారే నీరు, సబ్బుతో కడగాలి. దీని వల్ల వైరస్ శరీరంలోకి ప్రవేశించకుండా నిరోధించవచ్చు.దీని తర్వాత, మీరు వీలైనంత త్వరగా ఆసుపత్రికి చేరుకోవాలి. గాయం తీవ్రతను బట్టి వైద్యుడు మీకు ఇంజెక్షన్ ఇస్తారు. కుక్క కరిచినప్పుడు రేబిస్ తో పాటు టెటనస్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. అందుకే, దానికి కూడా కచ్చితంగా ఇంజెక్షన్ చేయించుకోవాలి. కనీసం నాలుగు నుంచి ఐదు డోస్ లు ఇంజెక్షన్ చేయించుకోవాలి. ఇలా చేయడం వల్ల రేబిస్ ప్రమాదం నుంచి బయటపడొచ్చు.వైద్యులు చెప్పిన ఆహారం తీసుకోవడం చాలా అవసరం.

డాక్టర్ చెప్పిన వీడియో కోసం కింద క్లిక్ చేయండి…

https://www.instagram.com/p/DLxJuK3z8AI/

Read more Photos on
click me!

Recommended Stories