జుట్టు ఆరోగ్యంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. దానికోసం రకరకాల ప్రాడక్టులు వాడుతుంటారు. కొన్నిసార్లు వాటివల్ల మంచి జరకపోగా.. జుట్టు సమస్యలు ఇంకా పెరగవచ్చు. అలాంటప్పుడు ఏం చేయాలి అనుకుంటున్నారా? అయితే గ్లిజరిన్ లో ఇవి కలిపివాడి చూడండి. మృదువైన, మెరిసే జుట్టు మీ సొంతం అవుతుంది!
చాలామందికి గ్లిజరిన్ గురించి తెలిసే ఉంటుంది. జుట్టు ఆరోగ్యానికి ఇది ప్రభావవంతంగా పనిచేస్తుంది. గ్లిజరిన్ లో వీటిని కలిపివాడటం ద్వారా జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అవెంటో ఇక్కడ చూద్దాం.
గ్లిజరిన్ హెయిర్ మాస్క్
గ్లిజరిన్‌ని కలబంద గుజ్జు లేదా తేనెతో కలిపి హెయిర్ మాస్క్ తయారు చేయండి. జుట్టు కుదుళ్ల నుంటి చివర్ల వరకు పట్టించి 30 నిమిషాలు ఉంచండి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. వారానికి ఒకసారి ఈ మాస్క్ వాడితే జుట్టు మృదువుగా మారుతుంది.
26
గ్లిజరిన్, నీటి స్ప్రే
స్ప్రే బాటిల్‌లో ఒక భాగం గ్లిజరిన్, నాలుగు భాగాల నీళ్ళు కలపండి. బాగా కలిపి జుట్టుపై స్ప్రే చేయండి. ముఖ్యంగా చిట్లిన, పొడి జుట్టుపై ఇది బాగా పనిచేస్తుంది. ఇది జుట్టులో తేమను నిలుపుతుంది. సహజమైన మెరుపునిస్తుంది.
36
గ్లిజరిన్ లీవ్-ఇన్ కండీషనర్
షాంపూ చేసిన తర్వాత మీ లీవ్-ఇన్ కండీషనర్‌లో కొన్ని చుక్కల గ్లిజరిన్ కలపండి. జుట్టు పొడవునా, చివర్లలో పట్టించండి. ఇది పొడి జుట్టుకి మంచిది.
46
షాంపూలో గ్లిజరిన్
మీ షాంపూలో కొన్ని చుక్కల గ్లిజరిన్ కలిపి వాడండి. ఇది జుట్టు పొడిబారకుండా కాపాడుతుంది. మృదువుగా చేస్తుంది.
56
గ్లిజరిన్, ఆయిల్స్ ట్రీట్మెంట్
గ్లిజరిన్‌లో లావెండర్, రోజ్‌మేరీ వంటి ఆయిల్స్ కొన్ని చుక్కలు కలపండి. ఈ మిశ్రమాన్ని జుట్టు, తలకు పట్టించి 15-20 నిమిషాలు మర్దన చేసి తర్వాత శుభ్రం చేసుకోండి.
66
గ్లిజరిన్ హెయిర్ సీరం
మీ జుట్టు పొడిబారితే గ్లిజరిన్ సీరం తయారు చేసుకోండి. గ్లిజరిన్‌లో నీళ్ళు లేదా జొజొబా వంటి తేలికపాటి నూనె కలపండి. కొన్ని చుక్కలు జుట్టు చివర్లకు పట్టించండి.