Samsung Smart TV : శాంసంగ్ టీవిలపై ఇయర్ ఎండ్ ఆపర్లు మామూలుగా లేవుగా... అద్భుతమైన ఫీచర్లు కలిగిన టీవీలు అతి తక్కువ ధరలకే లభిస్తున్నాయి. ఈ ఆఫర్ మరో రెండుమూడు రోజులే..
Year End Offers : మరో రెండుమూడు రోజులు గడిస్తే చాలు... 2025 సంవత్సరానికి గుడ్ బై చెప్పి 2026 లోకి అడుగుపెడతాం. కొత్త సంవత్సరాన్ని సరికొత్తగా ప్రారంభించాలని... జీవితాన్ని మరింత మెరుగ్గా మార్చుకోవాలని ప్రతిఒక్కరు కోరుకుంటారు. ఈ క్రమంలోనే మంచి వాహనం, ప్రిజ్, ఏసి, టీవి వంటివి కొనుగోలు చేయాలని భావించేవారికి గుడ్ న్యూస్. ప్రప్తుతం ఇయర్ ఎండ్ ఆఫర్స్ లో భాగంగా భారీ తగ్గింపు ధరలతో అమ్మకాలు జరుగుతున్నాయి... కాబట్టి వెంటనే కొనుగోలు చేస్తే మంచి లాభాన్ని పొందవచ్చు.
25
ఇయర్ ఎండ్ సేల్ లో నమ్మశక్యం ధరకు శాంసంగ్ టీవీలు..
2025 ఇయర్ ఎండ్ సేల్ లో భాగంగా ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ దిగ్గజం Samsung (శాంసంగ్) అతి తక్కువ ధరలకే వస్తువులను అందిస్తోంది. ప్రత్యేక ఆఫర్లతో ఎలక్ట్రానిక్స్ వస్తువుల అమ్మకాలు కూడా ఊపందుకున్నాయి. ముఖ్యంగా శాంసంగ్ ప్రీమియం స్మార్ట్ టీవీలు ఇప్పుడు నమ్మశక్యం కాని తక్కువ ధరలకు అందుబాటులో ఉన్నాయి.
ప్రముఖ ఆన్‌లైన్ స్టోర్ రిలయన్స్ డిజిటల్ శాంసంగ్ స్మార్ట్ LED టీవీలపై భారీ తగ్గింపును ప్రకటించింది. 32, 43, 55 అంగుళాల మూడు ప్రధాన మోడళ్లు తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి. బ్యాంకు ఆఫర్లతో మరింత ధర తగ్గుతోంది. పరిమిత కాల ఆఫర్లు కొనసాగుతున్న నేపథ్యంలో స్మార్ట్ టీవి కొనుగోలు చేయాలని భావించేవారికి ఇదే సరైన సమయం.
35
55 ఇంచెస్ టీవిపై 32 శాతం తగ్గింపా..!
55 అంగుళాల క్రిస్టల్ 4K అల్ట్రా HD స్మార్ట్ టీవీ 32% తగ్గింపు ధరతో లభిస్తోంది. సాధారణంగా రూ.55,220 ధర కలిగిన ఈ టీవి ఇయర్ ఎండ్ ఆఫర్ లో కేవలం రూ.37,490కే లభిస్తోంది. అంటే ఈ టీవి ఇప్పుడు కొనుగోలు చేయడంద్వారా రూ.17 వేలకు పైగా ఆదా చేసుకోవచ్చు.
ఇక 43 అంగుళాల ఫుల్ హెచ్‌డీ స్మార్ట్ టీవీ 20% తగ్గింపుతో వస్తోంది. దీని అసలు ధర రూ.27,550 కాగా ప్రస్తుతం కేవలం రూ.21,990కే అందుబాటులో ఉంది. బ్యాంక్ కార్డులపై అదనంగా మరో రూ.1000 డిస్కౌంట్ పొందవచ్చు. అంటే ఈ టీవిని ఇప్పుడే కొంటే రూ.7,000 నుండి రూ.8,000 వరకు లాభం పొందవచ్చు.
55
కేవలం రూ.12,990 కే శాంసంగ్ స్మార్ట్ టీవి
ఇక అత్యంత ప్రజాదరణ పొందిన 32 అంగుళాల HD రెడీ స్మార్ట్ టీవీ కూడా ప్రస్తుతం తగ్గింపు ధరల్లో లభిస్తోంది. దీని అసలు ధర రూ.17,900 కాగా ప్రస్తుత ఆఫర్లు, డిస్కౌంట్స్ తో కేవలం రూ.13,990 కే లభిస్తోంది. అంటే 22% తగ్గింపుతో వస్తోందన్నమాట. బ్యాంక్ ఆఫర్‌తో మరో వెయ్యి తగ్గుతుంది… అంటే రూ.12,990 కే పొందవచ్చు.