Dosa Batter: చలకాలంలో ఇడ్లీ, దోశె పిండి త్వరగా పులియాలంటే ఈ టిప్ ట్రై చేయండి

Published : Nov 21, 2026, 04:50 PM IST

Dosa Batter: చలికాలంలో ఇడ్లీ, దోశ పిండి పులియకపోవడం చాలామందికి ఎదురయ్యే సమస్య. ఎంతసేపు ఉంచినా పిండి ఉబ్బక ఇబ్బంది పడుతుంటారు. అయితే ఈ చిన్న చిట్కాతో ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. అసలు ఆ చిట్కా ఏంటి?

PREV
14
చలికాలం సమస్య

చలికాలం మొదలవగానే వంటింట్లో అందరికీ ఒకే సమస్య ఉంటుంది. అదే ఇడ్లీ/దోశ పిండి పులియడం. చలికాలంలో 8 నుంచి 10 గంటల ముందే పిండి రుబ్బుకున్నా సరిగ్గా పులియదు.

24
పులిసే ప్రక్రియ

సాధారణ రోజుల్లో 4 నుంచి 5 గంటలు బియ్యం, మినపప్పు నానబెట్టి రుబ్బుకోవాలి. ఆ తర్వాత 5 నుంచి 6 గంటల్లో ఇడ్లీ/దోశ చేయడానికి పిండి పూర్తిగా పులుస్తుంది. కానీ చలికాలంలో పులవదు. ఈ సమయంలో ఏం చేయాలో ఇక్కడ కొన్ని టిప్స్ ఉన్నాయి.

34
ఏమిటా ఉపాయం?

రుబ్బుకున్న పిండిని ఒక గిన్నెలో వేసుకోండి. ఆ తర్వాత ఆ గిన్నె మూతికి ఒక కాటన్ బట్టను గట్టిగా కట్టండి. తర్వాత దానిపై ఒక ప్లేట్‌తో మూత పెట్టండి. ఇలా పిండిని నిల్వ చేస్తే పులిసే ప్రక్రియ వేగం పెరుగుతుంది. గిన్నెను బట్టతో కట్టడం వల్ల లోపల వేడి వాతావరణం ఏర్పడి పిండి త్వరగా పులుస్తుంది.

44
గిన్నెను వెచ్చని వాతావరణంలో ఉంచండి!

రుబ్బుకున్న పిండి గిన్నెను ఇంట్లో వెచ్చగా ఉండే చోట ఉంచండి. ఉదాహరణకు వంట పూర్తయ్యాక పొయ్యి మీద పెట్టొచ్చు. పొయ్యి వేడి పిండి పులియడానికి సహాయపడుతుంది. ఇంట్లో ఓవెన్ ఉంటే, 10 నుంచి 20 సెకన్ల పాటు టైమర్ సెట్ చేసి ఆఫ్ చేయండి. ఈ ట్రిక్స్ మీకు బాగా ఉపయోగపడతాయి.

Read more Photos on
click me!

Recommended Stories