చలికాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని మరువకుండా తినండి

First Published | Oct 27, 2023, 11:37 AM IST

చలికాలంలో మొదలైందో లేదో.. అప్పుడే ఉదయం, రాత్రి వేళల్లో కొన్ని ప్రాంతాల్లో విపరీతంగా చలి పెడుతోంది. అయితే ఈ సీజన్ లో జనాలు వెచ్చగా, ఆరోగ్యంగా ఉండేందుకు ఎన్నో రకాల ఆహారాలను తింటుంటారు. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ఈ సీజన్ లో కొన్ని రకాల ఆహారాలను తింటే శరీరం ఆరోగ్యంగా ఉండటమే కాకుండా.. ఇమ్యూనిటీ పవర్ కూడా బాగా పెరుగుతుంది. 
 

చలికాలం వచ్చేసింది. దేశ రాజధాని ఢిల్లీతో సహా చాలా ప్రాంతాల్లో తేలికపాటి చలి స్టార్ట్ అయ్యింది. మారుతున్న వాతావరణంతో పాటుగా మన జీవనశైలిని కూడా మార్చుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. లేదంటే ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే చలికాలంలో చలినుంచి తమను తాము రక్షించుకునేందుకు స్వెట్టర్లను వసుకుంటారు. అలాగే శరీరం వెచ్చగా ఉండేందుకు కొన్ని ఆహారాలను కూడా తింటుంటారు. అయితే చలికాలంలో మన ఇమ్యూనిటీ పవర్ బాగా తగ్గుతుంది. దీనివల్లే లేనిపోని రోగాల బారిన పడాల్సి వస్తుంది. ముఖ్యంగా దగ్గు, జలుబు, గొంతునొప్పి, జ్వరం వంటి సమస్యల బారిన ఎక్కువగా పడే అవకాశం ఉంది. అందుకే మారుతున్న సీజన్ లో మనల్ని మనం రక్షించుకునేందుకు మనం తీసుకునే ఆహారం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు నిపుణులు. 
 

చలికాలంలో మనల్ని మనం బలంగా, ఆరోగ్యంగా ఉంచుకునేందుకు బలమైన ఆహారాలను తీసుకోవాలి. విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉన్న ఆహారాలను తినాలి. మరి చలికాలంలో మనం ఎలాంటి రోగాల బారిన పడకుండా ఉండేందుకు ఎలాంటి ఆహారాలను తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 


spices


మసాలా దినుసులు

భారతదేశంలో మసాలా దినుసులను ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ మసాలా దినుసులు ఫుడ్ రుచిని పెంచడమే కాకుండా మన ఆరోగ్యానికి కూడా ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తాయి. ఆరోగ్య నిపుణుల ప్రకారం..చాలా మసాలా దినుసులు ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి మనల్ని రక్షిస్తాయి. చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి పసుపు, దాల్చిన చెక్క, అల్లం వంటి మసాలా దినుసులను మీ రోజువారి ఆహారంలో చేర్చుకోవచ్చు. ఈ మసాలా దినుసుల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచడమే కాకుండా మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. 
 

గింజలు, విత్తనాలు

డ్రై ఫ్రూట్స్ లో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. విత్తనాలు, గింజల్లో మనల్ని ఆరోగ్యంగా ఉంచే విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యాన్ని కాపాడుతాయి. చలికాలంలో మీరు ఆరోగ్యంగా ఉండాలంటే వాల్ నట్స్, బాదం, లిన్ సీడ్ విత్తనాలను రెగ్యులర్ గా తినండి. వీటిలో మనల్ని ఆరోగ్యంగా ఉంచే పోషకాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. 
 

ఆకుకూరలు

చలికాలంలో మార్కెట్ లో రకరకాల ఆకు కూరలు దొరుకుతాయి. ఈ సీజన్ లో ఆకు కూరలను ఎక్కువగా పండిస్తారు. నిజానికి ఆకు కూరలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ ఆకు కూరల్లో మనల్ని ఆరోగ్యంగా ఉంచే ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే పాలకూర, బచ్చలి కూర వంటి ఆకు కూరలను రోజూ తినండి. ఆకుకూరల్లో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మనల్ని ఎన్నో రోగాలకు దూరంగా ఉంచుతాయి. 

సూప్ లు

చలికాలంలో ఆరోగ్యంగా ఉండేందుకు, చలినుంచి మిమ్మల్ని మీరు రక్షించుకునేందుకు ఈ సీజన్ లో సూప్ ను ఖచ్చితంగా తాగండి. సూప్ లు కూడా మన శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి. ఈ సీజన్ లో మీరు ఎలాంటి రోగాల బారిన పడకూడదంటే టమాటాలు, వివిధ రకాల కూరగాయలతో తయారుచేసిన పోషకాలు ఎక్కువగా ఉండే సూప్లను మీ రోజువారి ఆహారంలో భాగం చేసుకోవచ్చు. సూప్ లో మనల్ని ఆరోగ్యంగా ఉంచేందుకు  అవసరమైన విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. 
 

సిట్రస్ పండ్లు

నిమ్మకాయ, నారింజ వంటి సిట్రస్ పండ్లు కూడా మన ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయపడతాయి. సిట్రస్ పండ్లలో మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచే విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అందుకే చలికాలంలో మీరు ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్ సి ఎక్కువగా ఉండే సిట్రస్ పండ్లను తప్పకుండా తినండి. 

Latest Videos

click me!