వీటిని తింటే చలి ఎక్కువ పెట్టదు

First Published | Oct 26, 2023, 9:36 AM IST

చలి షురూ అయ్యింది. ఉదయం, సాయంత్రం వేళల్లో విపరీతమైన చలి పెడుతుంటుంది. దీనివల్ల బయటకు కూడా వెళ్లలేకపోతుంటారు. అయితే ఈ సీజన్ లో కొన్ని ఆహారాలను తింటే శరీరం వెచ్చగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

చలికాలం మొదలైంది. ఇప్పటికె చలి షురూ అయ్యింది. దీనివల్ల చాలా మందికి జలుబు కూడా చేస్తుంటుంది. వాతావరణంలో మార్పుల ప్రభావం మన ఆరోగ్యంపై కూడా కనిపిస్తుంది. అందుకే చలికాలం వచ్చిందంటే వెచ్చని స్వెట్టర్లను వేసుకోవడంతో పాటుగా ఆహార పదార్థాలను కూడా తింటుంటారు. ఇవి చలిని తగ్గించడానికి, మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. మీరు కూడా చలి నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలంటే మీ రోజువారి ఆహారంలో వీటిని చేర్చండి. 


డ్రై ఫ్రూట్స్

డ్రై ఫ్రూట్స్ లో ఎన్నో రకాల పోషకాలుంటాయి. ఇవి మనల్ని ఎన్నో రోగాలకు దూరంగా ఉంచుతాయి. అంతేకాదు వీటిని తింటే మన శరీరం లోపలి నుంచి వెచ్చగా ఉంటుంది. ఇందుకోసం వాల్ నట్స్, బాదం, పిస్తా, జీడిపప్పు వంటి డ్రై ఫ్రూట్స్ ను తినండి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అయితే ఇవి శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి సహాయపడతాయి. 
 

Latest Videos


వేర్లు కూరగాయలు

చలికాలంలో రకరకాల కూరగాయలను పండిస్తుంటారు. ముఖ్యంగా బీట్ రూట్, క్యారెట్లు, టర్నిప్స్ వంటి రూట్ వెజిటేబుల్స్  మార్కెట్ లో పుష్కలంగా దొరుకుతాయి. చలికాలంలో మీరు వెచ్చగా, ఆరోగ్యంగా ఉండాలనుకుంటే ఈ కూరగాయలను ఖచ్చితంగా తినండి.  ఈ వేర్ల కూరగాయల్లో మన శరీరానికి అవసరమైన పోషకాలు, విటమిన్ ఎ, విటమిన్ సి లు పుష్కలంగా ఉంటాయి. వీటిని తింటే మీ ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. 

ఓట్ మీల్

చలికాలంలో ఆరోగ్యంగా ఉండటానికి ఓట్ మీల్ కూడా ఎంతగానో సహాయపడుతుంది. గోధుమలతో తయారనైనా ఓట్ మీల్ ను ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో లో తింటే ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది. ఇవి మీ కడుపును మధ్యాహ్నం వరకు నిండుగా ఉంచుతాయి. వీటిని తింటే మీరు రోజంతా ఎనర్జిటిక్ గా ఉంటారు. అలాగే శరీరం కూడా వెచ్చగా ఉంటుంది. 
 


సూప్

చలికాలంలో సూప్ లను ఖచ్చితంగా తాగాలంటారు ఆరోగ్య నిపుణులు. ఎందుకంటే సూప్ లో కూరగాయలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి మన శరీరాన్ని ఆరోగ్యంగా, లోపలి నుంచి వెచ్చగా ఉంచుతుంది. అంతేకాదు ఈ సీజన్ లో కార్బ్ ఎక్కువగా ఉండే పప్పుధాన్యాలు, సొరకాయ, బార్లీతో తయారు చేసిన సూప్లు మంచివని నిపుణులు అంటున్నారు. 
 

తేనె

తేనెను కాలాలతో సంబంధం లేకుండా తీసుకోవచ్చు. ఎందుకంటే దీనిలో మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. చలికాలంలో తేనెను ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే దీన్నిసాంప్రదాయకంగా దగ్గు, జలుబు, గొంతునొప్పిని తగ్గించడానికి ఎన్నో ఏండ్ల నుంచి ఉపయోగిస్తున్నారు. 
 

spices

మసాలా దినుసులు

మన దేశంలో మసాలా దినుసులను ఎక్కువగా వాడుతుంటారు. ఇవి ఫుడ్ టేస్ట్ ను పెంచడంతో పాటుగా ఎన్నో ఎన్నో ప్రయోజనాలను కూడా కలిగిస్తాయి. మసాలా దినుసులు మన శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి కూడా సహాయపడుతాయి. అందుకే ఈ సీజన్ లో మీ రోజువారి ఆహారంలో అల్లం, జీలకర్ర, నల్ల మిరియాలు, నువ్వులు , దాల్చినచెక్క వంటి మసాలా దినుసులను చేర్చండి. 
 

click me!