15రోజులు ఈ డైట్ చేస్తే నాజుకుగా మారడం ఖాయం..!

First Published | Oct 25, 2023, 3:25 PM IST

మీరు కేవలం 15 రోజుల్లో సులభంగా బరువు తగ్గవచ్చు. దసరా అయిపోయింది. దీపావళి పండగ వచ్చే సమయానికి మీకు నచ్చిన అవుట్ ఫిట్ ని ధరించవచ్చు. మరి ఆ డైట్ ఏంటో ఓసారి చూద్దాం..
 

diabetes diet

ఈరోజుల్లో చాలా మంది బరువు తగ్గడానికి చాలా తిప్పలు పడుతున్నారు. సరైన డైట్ ప్లాన్ లేకపోవడం వల్ల బరువు తగ్గడం అంత సులువుగా మారడం లేదు. అయితే, మీరు ఈ కింది డైట్ ఫాలో అవ్వడం వల్ల, మీరు కేవలం 15 రోజుల్లో సులభంగా బరువు తగ్గవచ్చు. దసరా అయిపోయింది. దీపావళి పండగ వచ్చే సమయానికి మీకు నచ్చిన అవుట్ ఫిట్ ని ధరించవచ్చు. మరి ఆ డైట్ ఏంటో ఓసారి చూద్దాం..
 

1.Day1:మీ రోజుని గోరువెచ్చని నీరు, నిమ్మరసం కలిపి తీసుకోవాలి. ఆ తర్వాత బ్రేక్ ఫాస్ట్ లో ఒక కప్పు ఓట్స్, పండ్లు తీసుకోవాలి. ఇక, లంచ్ లో ఒక కప్పు బ్రౌన్ రైస్ లేదంటే, చపాతీ పప్పుతో కలిపి తీసుకోవాలి. ఏదైనా కూర తినొచ్చు. ఇక, స్నాక్స్ సమయంలో గుప్పెడు నట్స్ తీసుకోవాలి. డిన్నర్ లో గ్రిల్డ్ చికెన్, పన్నీర్ కూరగాయలతో కలిపి తీసుకోవాలి.


2.Day2:బ్రేక్ ఫాస్ట్ లో పాలకూర, బనానా స్మూతీలు తాగాలి. లంచ్ లో కినోవా, లేదంటే బ్రౌన్ రైస్ తో చనాదాల్ కర్రీని తీసుకోవాలి. స్నాక్స్ లో లో పండ్లు, పెరుగు తీసుకోవాలి. ఇక, డిన్నర్ లో  చేప కొన్ని ఆవిరి మీద ఉడికించిన కూరగాయలు తీసుకోవాలి.
 

3.Day3: బ్రేక్ ఫాస్ట్ లో వోల్ గ్రెయిన్ టోస్ట్,అవకాడో, ఉడకపెట్టిన కోడిగుడ్డు తినాలి. లంచ్ లో రోటీలో పాలకూర, పన్నీర్ కర్రీ తినాలి. సాయంత్రం స్నాక్స్ లో క్యారెట్, కీరదోస ముక్కలు తినాలి. డిన్నర్ లో గ్రిల్డ్ పన్నీర్ కినోవా, రోస్ట్ చేసిన కూరగాయలు తినాలి.

4.Day4: బ్రేక్ ఫాస్ట్ లో కూరగాయలతో చేసిన ఉప్మా తినాలి. లంచ్ లో పప్పుతో కినోవా కానీ, బ్రౌన్ రైస్ కానీ తినాలి. స్నాక్స్ లో గ్రీక్ యోగర్ట్ తినాలి. ఇక, డిన్నర్ లో బేక్ చేసిన చికెన్ , ఉడకపెట్టిన బ్రోకలి తినాలి.

Diet

5.Day5: బ్రేక్ ఫాస్ట్ లో బటానీలు, పల్లీలు వేసుకొని పోహ తినాలి. లంచ్ లో మిక్సడ్ కూరగాయలతో కలిసి చేసిన రోటీ తినాలి. స్నాక్స్ లో మిక్స్ డ్ బెర్రీలు తినాలి. ఇక, డిన్నర్ లో గ్రిల్డ్ చేప, కినోవా తీసుకోవాలి.
 

Healthy diet

6.Day6: బ్రేక్ ఫాస్ట్ లో ఒక గిన్నె ఓట్స్ ని క్రీమ్ లేని పాలు, బనానా కలిపి తీసుకోవాలి. స్నాక్స్ లో గుప్పెడు నట్స్ తీసుకోవాలి. లంచ్ లో గ్రిల్డ్ చికెన్,కూరగాయలను బ్రౌన్ రైస్ తినాలి. ఇక, స్నాక్స్ లో గ్రీక్ యోగర్ట్, డిన్నర్ లో గ్రిల్డ్ ఫిష్,కొద్దిగా వేయించిన పాలకూర తినాలి.
 

Vegetarian Diet

7.Day7: బ్రేక్ ఫాస్ట్ లో పాలకూరతో చేసిన స్మూతీ తీసుకోవాలి. ఆ తర్వాత మార్నింగ్ సాక్స్ లో క్యారెట్, కీర దోస ముక్కలు తినాలి. ఆ తర్వాత లంచ్ లో రోటీ, పప్పు,కూరగాయలు తినాలి. ఈవెనింగ్ స్నాక్స్ లో పండు, డిన్నర్ లో కినోవా విత్ కూరగాయలు తినాలి.
 

8.Day8: బ్రేక్ ఫాస్ట్ లో వోల్ గ్రెయిన్ బ్రెడ్ టోస్ట్ అవకాడో, ఉడకపెట్టిన గుడ్డు తినాలి. మార్నింగ్ స్నాక్స్ లో  ఒక కప్పు బొప్పాయి తినాలి. లంచ్ లో బ్రౌన్ రైస్,  పెరుగు, వెజిటేబుల్ సలాడ్ లాంటివి తినాలి. ఈవెనింగ్ స్నాక్స్ లో హెర్బల్ టీ, డిన్నర్ లో గ్రిల్డ్ చికెన్, రోస్టెడ్ కూరగాయలు తీసుకోవాలి.
 

9.Day9: బ్రేక్ ఫాస్ట్ లో కూరగాయలతో తయారు చేసిన ఉప్మా తినాలి.స్నాక్స్ లో మిక్స్డ్ ఫ్రూట్ సలాడ్ తినాలి.లంచ్ లో రోటీలో పాలకూర, సలాడ్ తినాలి. స్నాక్స్ లో క్యారెట్, కీరదోస తినాలి. ఇక, డిన్నర్ లో బేక్ చేసిన ఫిష్, సార్ట్ చేసిన బ్రొకోలీ తీసుకోవాలి.
 

మిగిలిన మరో ఆరు రోజులు కూడా పైన డేస్ డైట్ ని రిపీట్ చేయాలి. ఇలా కరెక్ట్ గా 15 రోజులు క్రమం తప్పకుండా  పాటిస్తే, కచ్చితంగా బరువు విషయంలో రిజల్ట్ చూస్తారు. 
 

Latest Videos

click me!