గుంటూరు కారం ఎందుకు అంత స్పైసీగా ఉంటుంది..? రీజన్ ఇదే..!

First Published Mar 18, 2024, 4:23 PM IST

గుంటూరులో మాత్రమే అంత స్పెసీ మర్చి ఎలా పండుతోంది..?  దీని వెనక పెద్ద కారణమే ఉంది. ఆ ఘాటు.. నాటే మిరప గింజలో కాదు.. మొక్క పండే నేలపై ఉందనే విషయం ఎక్కువ మందికి తెలిసి ఉండకపోవచ్చు.

మనలో అందరూ వంటల్లో కారం వాడతారు. అది చాలా కామన్ . కారాల్లో కూడా మన దగ్గర చాలా రాకాలు దొరుకుతాయి. కానీ.. గుంటూరు కారం మాత్రం అందులో స్పెషల్ అనే చెప్పాలి. ఇతర ప్రాంతాల్లో పండే కారం కంటే.. గుంటూరు కారం ఘాటు చాలా ఎక్కువగా ఉంటుంది. నోట్లో పెట్టుకుంటే మండిపోవాల్సిందే. నోటిదాకా ఎందుకు.. చేతితో పట్టుకున్నా.. చేతులు కూడా మండిపోతాయి. 
 

అసలు.. గుంటూరు కారానికి అంత ఘాటు ఎందుకు ఉంటుందో.. దాని వెనక ఉన్న కారణం ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా..? గుంటూరులో మాత్రమే అంత స్పెసీ మర్చి ఎలా పండుతోంది..?  దీని వెనక పెద్ద కారణమే ఉంది. ఆ ఘాటు.. నాటే మిరప గింజలో కాదు.. మొక్క పండే నేలపై ఉందనే విషయం ఎక్కువ మందికి తెలిసి ఉండకపోవచ్చు.

red chilli.

ఏదైనా ప్లేస్ లో ఎండలు ఎక్కువగా ఉండి, నీరు తక్కువగా ఉంటే.. అక్కడ పండే మిర్చీ పంట చాలా స్పైసీగా ఉంటుంది, ఆంధ్రాలో ఎండలు ఎలా ఉంటాయో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే.. వాటర్ షాటేజ్ కూడా కాస్త ఎక్కువ అనే చెప్పాలి. అలా.. హీట్ ఎక్కువగా ఉండి.. వాటర్ షాటేజ్ ఉన్న ప్రదేశాల్లో మిర్చీ చాలా ఘాటుగా పండుతుందట.

గుంటూరులో పండే స్పైసీ గుంటూరు కారం వెనక కూడా అదే జరుగుతుంది. కానీ.. తెలుసా.. కారం తింటే.. ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. సాధారణంగా ఈ రోజు స్పైసీ ఫుడ్ తింటే.. కారంగా అనిపించినా.. మరుసటి రోజు మళ్లీ తినాలి అని ఎక్కువ మందికి అనిపిస్తూ ఉంటుందట. దీంతో.. వారు  ఆ స్పైసీ ఫుడ్ రోజూ తినడం వల్ల వారు ఆ కారానికి అలవాటు పడిపోతూ ఉంటారు. 

ఇంతకీ మన గుంటూరు కారానికి అంత ఘాటు ఎలా వచ్చిందో అర్థమైందిగా.  అంత ఘాటుగా ఉన్నా.. మన గుంటూరు కారం తో చేస్తే ఎలాంటి వంటకైనా రుచి అదిరిపోవాల్సిందే. అందుకే.. మన దేశంలోనే కాదు.. విదేశాల్లోనూ ఈ కారానికి చాలా డిమాండ్ ఎక్కువ. అయితే... ఈ విషయాన్ని మేం చెప్పడం లేదు.  ఓ ప్రముఖ చెఫ్.. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకోగా.. నెట్టింట వైరల్ గా మారింది.

వీడియో కోసం కింద క్లిక్ చేయండి..

గుంటూరు కారం స్పైసీగా ఉండటానికి కారణం ఇదే..

click me!