cucumber
ప్రస్తుత కాలంలో చాలా మంది ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నారు. ఆరోగ్యంగా ఉండేందుకు పండ్లు, కూరగాయలను, పోషకాహారాలను ఎక్కువగా తింటున్నారు. ఇది మంచి విషయమే కానీ.. మన ఆరోగ్యానికి మేలు చేసే కొన్ని ఆహార పదార్థాల గురించి మాత్రం మర్చిపోతుంటాం. ఇలాంటి వాటిలో కీరదోసకాయ ఒకటి. ఇవి చాలా తక్కువ ధరలోనే దొరుకుతాయి. కానీ వీటిలో ఎన్నో పోషకాలుంటాయి. దీన్ని తింటే మన ఆరోగ్యానికి ఏ ఢోకా ఉండదు. అసలు ఎండాకాలంలో కీరదోసకాయలను తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
cucumber
హైడ్రేషన్
ఎండాకాలంలో హైడ్రేషన్ చాలా చాలా అవసరం. అయితే ఎండాకాలంలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే కీరదోసకాలను తింటే బాడీ డీహైడ్రేట్ అయ్యే అవకాశమే ఉండదు. దోసకాయలు క్రంచీగా ఉండటమే కాకుండా మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుతాయి. అలాగే ఇవి మిమ్మల్ని చల్లగా కూడా ఉంచుతాయి.
Cucumbers
పోషకాహారం
కీరదోసకాయలో నీటితో పాటుగా ఎన్నో ముఖ్యమైన పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. వీటిలో విటమిన్ కె, విటమిన్ సి, పొటాషియం లు మెండుగా ఉంటాయి. ఇవి మన ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతాయి. మన రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. అలాగే ఎలక్ట్రోలైట్ సమతుల్యతను నిర్వహించడానికి కూడా సహాయపడతాయి.
cucumber
బరువు నియంత్రణ
కీరదోసకాయలలో కేలరీలు తక్కువగా ఉంటాయి. వాటర్, ఫైబర్ కంటెంట్ లు ఎక్కువగా ఉంటాయి. ఇవి మీరు బరువు పెరగకుండా చేయడానికి బాగా సహాయపడతాయి. వీటిని మీ రెగ్యులర్ డైట్ లో చేర్చడం వల్ల ఆకలి తగ్గుతుంది. అలాగే కేలరీలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినకుండా చేస్తుంది. దీంతో మీరు సులువుగా బరువు తగ్గుతారు.
cucumber
చర్మం చల్లగా
ఎండాకాలం ఎండల వల్ల మన చర్మం బాగా ప్రభావితమవుతుంది. కీరదోసకాయలలో సిలికాన్ డయాక్సైడ్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది చర్మ స్థితిస్థాపకత, ఆర్ద్రీకరణకు సహాయపడుతుంది. కీరదోసకాయ ముక్కలు లేదా కీరదోసకాయ కలిగిన పదార్థాలను ఉపయోగించి సూర్యరశ్మి సంబంధిత చర్మ సమస్యలను తగ్గించుకోవచ్చు. ఇది చర్మాన్ని తేమగా ఉంచుతుంది.
cucumber
జీర్ణక్రియ
కీరదోసకాయలలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. వీటిని మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల పేగు కదలికలు మెరుగుపడతాయి. అలాగే కడుపు అసౌకర్యం, ఉబ్బరం సమస్యలు తగ్గుతాయి. మలబద్దకం సమస్య కూడా ఉండదు. ఎండాకాలంలో నిర్జలీకరణం వల్ల జీర్ణక్రియ దెబ్బతింటుంది. కీరదోసకాయను తింటే ఇలాంటి సమస్యే రాదు.
cucumber
నోటి దుర్వాసన
కీరదోసకాయలో సహజ శ్వాస రిఫ్రెష్ లక్షణాలు ఉంటాయి. ఇవి ఎండను తట్టుకోవడానికి సహాయపడతాయి. కీరదోసకాయను తింటే నోటి దుర్వాసన కూడా రాదు. వీటిలో ఉండే ఫైటోకెమికల్స్ నోటి దుర్వాసనతో పోరాడి లోపలి నుంచి తాజా శ్వాసకు సహాయపడతాయి.
సూర్యరశ్మి సమస్యలు
వడదెబ్బకు గురైన వారికి కీరదోసకాయలు బాగా సహాయపడతాయి. కీరదోసకాయ ముక్కల శీతలీకరణ ప్రభావం వడదెబ్బకు గురైన చర్మాన్ని ఉపశమనం కలిగిస్తుంది. అలాగే ఉబ్బరం, అసౌకర్యాన్ని తగ్గిస్తుంది.