ఆరోగ్యం బాలేనప్పుడు ఏం తినాలి?

First Published Mar 17, 2024, 2:07 PM IST

మనమందరం ఎప్పుడో ఒకసారి అనారోగ్యానికి గురవుతుంటాం. దీంతో  హాస్పటల్ కు వెళ్లి మందులను వాడుతుంటాం. అయితే అనారోగ్యం నుంచి కోలుకోవాలంటే మీరు మందులను వాడటమే కాకుండా మంచి ఆహారాలను కూడా తినాలి. దీనివల్ల మీరు త్వరగా కోలుకుంటారు. 
 

ఆరోగ్యం బాలేనప్పుడు నోరంతా చేదుగా ఉంటుంది. అలాగే ఏదీ తినాలనిపించదు. కానీ ఈ సమయంలోనే మీరు మంచి ఆహారాలను తినాలి. ఎందుకంటే హెల్తీ ఫుడ్ ను తింటే మీరు అనారోగ్యం నుంచి త్వరగా కోలుకుంటారు. అలాగే మీకు ఎనర్జీ కూడా ఉంటుంది. అంతేకాదు మీ శరీరం ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన పోషకాలు కూడా అందుతాయి. మంచి ఆహారం మీరు హైడ్రేట్ గా ఉండటానికి కూడా సహాయపడుతుంది.
 

Image: Freepik


అసలు ఆరోగ్యం బాలేనప్పుడు ఏం తినాలి అన్న ప్రశ్న తలెత్తుతుంది. అయితే ఇది పూర్తిగా మీ ఆరోగ్య పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు మీకు మలబద్దకం సమస్య ఉంటే పండ్లు, తృణధాన్యాలు వంటి  ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఆహారాలను తినాలి. ఇవి మీరు త్వరగా కోలుకోవడానికి సహాయపడతాయి. అసలు ఆరోగ్యం బాలేనప్పుడు ఏం తినాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

బోన్ సూప్, చికెన్ సూప్

మీ ఆరోగ్యం బాలేనప్పుడు బోన్ సూప్ లేదా చికెన్ సూప్ ను తాగొచ్చు. ఇది మీకు మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. వీటిలో మీ రోగనిరోధక శక్తిని పెంచే ఎన్నో రకాల విటమిన్లు, ఖనిజాలు, అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఈ టైంలో మీకు హైడ్రేషన్ అవసరం కాబట్టి వీటిని తీసుకుంటే మీరు డీహైడ్రేషన్ బారిన పడే ప్రమాదం తగ్గుతుంది. బోన్ సూప్, చికెన్ సూప్ సులభంగా జీర్ణమవుతాయి. అవి రికవరీకి సహాయపడే ఎలక్ట్రోలైట్లు, పోషకాలను అందిస్తాయి.
 

fruits


పండ్లు, కూరగాయలు

అనారోగ్యంతో ఉన్నప్పుడు చాలా మంది పండ్లను, కూరగాయలను తినడం మానేస్తారు. కానీ ఈ టైంలో మీరు వీటిని ఖచ్చితంగా తినాలి. ఎందుకంటే వీటిలో ఎన్నో రకాల విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ , యాంటీఆక్సిడెంట్లు, ఫైటోన్యూట్రియెంట్స్ ఉంటాయి. వీటిని తినడం వల్ల మీ ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. అలాగే అనారోగ్యం నుంచి మీ శరీరం త్వరగా కోలుకుంటుంది. మీరు మీ ఆహారంలో బెర్రీలు, ఆకుకూరలు మొదలైన వాటికి సిట్రస్ పండ్లను చేర్చండి. 
 

మూలికలు

మీరు అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలంటే మీరు ఎన్నో రకాల మూలికలు, సుగంధ ద్రవ్యాలను కూడా మీ ఆహారంలో చేర్చండి. వెల్లుల్లి, అల్లం, పసుపు, దాల్చినచెక్క మొదలైన వాటిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి అంటువ్యాధులతో పోరాడటానికి, మంటను తగ్గించడానికి సహాయపడతాయి.

పానీయాలు తీసుకోండి

అనారోగ్యం నుంచి కోలుకోవాలంటే మీరు పానీయాలను పుష్కలంగా తాగాలి. ఇవి మిమ్మల్ని హైడ్రేట్ గా ఉంచుతాయి. ఈ సమయంలో మీరు నీటిని పుష్కలంగా తాగాలి. అలాగే హెర్బల్ టీ, కొబ్బరి నీరు, ఇతర ఎలక్ట్రోలైట్ ఎక్కువగా ఉండే పానీయాలను తాగాలి. అనారోగ్యం కారణంగా మీరు కోల్పోయిన ద్రవాలు, ఎలక్ట్రోలైట్లను తిరిగి నింపడానికి ఈ పానీయాలు మీకు సహాయపడతాయి. దీని వల్ల మీ రికవరీ కూడా త్వరగా ఉంటుంది. 

click me!