సొరకాయలో పోషకాలు...
సొరకాయలో విటమిన్ సి, విటమిన్ బి పుష్కలంగా ఉంటాయి. విటమిన్ ఎ, విటమిన్ ఇ ఐరన్, పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు కూడా ఉటాయి. అంతేకాదు.. జింక్, ఫోలిక్ యాసిడ్, రాగి, సెలీనియం, కాల్షియం, భాస్వరం కూడా ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. దీనిలో నీటి శాతంతో పాటు, ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. బరువు తగ్గాలి అనుకునేవారికి చాలా బాగా సహాయపడుతుంది.
సొరకాయ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు...
సొరకాయలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది కడుపును శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది. ప్రధానంగా ఈ కూరగాయలో తక్కువ కేలరీల శాతం తక్కువగా ఉంటుంది. ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల కడుపు తొందరగా నిండుతుంది. సొరకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కాలేయాన్ని శుభ్రపరచడంలో, ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.