క్యాప్సికం కూరను తింటే ఏమౌతుంది?

Published : Aug 17, 2025, 02:35 PM IST

కూరగాయల్లో క్యాప్సికం ఒకటి. చాలా మంది ఈ కూరను చాలా ఇష్టంగా తింటుంటారు. కానీ ఈ కూరను తింటే ఏమౌతుందో తెలుసా? 

PREV
16
Capsicum

నాన్ వెజ్ కంటే వెజ్ నే చాలా మంది ఇష్టపడతారు. నిజానికి కూరగాయల్లో మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు మెండుగా ఉంటాయి. అందుకే కూరగాయల్ని బాగా తినాలని ఆరోగ్య నిపుణులు, డాక్టర్లు చెప్తుంటారు. మనకు మేలు చేసే కూరగాయల్లో క్యాప్సికం ఒకటి. అయితే ఈ క్యాప్సికం కూరను తింటే ఏమౌతుందో తెలుసా?

26
ఇమ్యూనిటీ పెరుగుతుంది

మనకు ఇమ్యూనిటీ పవర్ ఎంత ఎక్కువగా ఉంటే.. మనం అంత ఆరోగ్యంగా ఎలాంటి జబ్బులు లేకుండా ఉంటాం. ఇమ్యూనిటీ పవర్ వల్ల దగ్గు, జలుబు, వైరల్ ఫీవర్ వంటి ఎన్నో అనారోగ్య సమస్యలకు దూరంగా ఉంటాం. అయితే మన ఇమ్యూనిటీ పవర్ ను విటమిన్ సి పెంచుతుంది. ఈ విటమిన్ సి సిట్రస్ పండ్లలోనే కాకుండా క్యాప్సికంలో కూడా ఉంటుంది. కాబట్టి ఈ కూరను తిన్నా మీ రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది.

36
బరువు తగ్గుతారు

బరువు తగ్గడానికని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అన్నం మానేసి చపాతీలు తినడం, వెజిటేబుల్స్ ను ఎక్కువగా తినడం లాంటివి చేస్తుంటారు. అయితే బరువు తగ్గాలనుకునేవారికి క్యాప్సికం కూడా బాగా ఉపయోగపడుతుంది. అవును దీనిలో ఉండే క్యాప్సైసిస్ మీ జీవక్రియను పెంచి మీరు బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

46
కళ్ల ఆరోగ్యానికి మంచిది

క్యాప్సికం కూరగాయ మన కళ్ల ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనిలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి మీరు ఈ క్యాప్సికం కూరను తింటే మీ కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. కంటి చూపు కూడా మెరుగుపడుతుంది.

చర్మ ఆరోగ్యం

క్యాప్సికం మన చర్మానికి కూడా మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ కూర చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ కూరను తినడం వల్ల మీ చర్మం కాంతివంతంగా ఉంటుంది. అలాగే ముడతలు ఏర్పడే అవకాశం తగ్గుతుంది.

56
గుండె ఆరోగ్యం

ఈ రోజుల్లో గుండె సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. మీకు ఇలాంటి సమస్యలు రావొద్దంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే క్యాప్సికం మన గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఈ క్యాప్సికంను తింటే రక్తపోటు అదుపులో ఉంటుంది. కొలెస్ట్రాల్ తగ్గుతుంది.

బలమైన జీర్ణవ్యవస్థ

క్యాప్సికం కూర మన జీర్ణవ్యవస్థను బలంగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది. ఈ కూరగాయలో ఫైబర్ కంటెంట్ మెండుగా ఉంటుంది. దీన్ని తింటే మలబద్దకం సమస్య నుంచి బయటపడతారు. ఇది జీర్ణ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

66
కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం

ఆర్థరైటిస్, కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులతో బాధపడేవారికి క్యాప్సికం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ కూరగాయను తింటే కీళ్ల నొప్పులు , మంట వంటి ఆర్థరైటిస్ లక్షణాలు తగ్గుతాయి.

డయాబెటీస్ పేషెంట్లకు మేలు

డయాబెటీస్ పేషెంట్లు ఆహారం విషయంలో చాలా కేర్ ఫుల్ గా ఉండాలి. ఎందుకంటే ఏవి పడితే అవి తింటే షుగర్ లెవెల్స్ బాగా పెరిగి ఆరోగ్యం దెబ్బతింటుంది. అయితే వీళ్లు ఎలాంటి భయం లేకుండా క్యాప్సికం ను తినొచ్చు. ఇది డయాబెటీస్ ను కంట్రోల్ చేయడానికి సహాయపడుతుంది.దీన్ని తింటే షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం తగ్గుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories