
స్వీట్లు అంటే ఇష్టం లేనివాళ్లు చాలా అరుదుగా ఉంటారనే చెప్పొచ్చు. ముఖ్యంగా గులాబ్ జామూన్, జిలేబీ, కల్కండ, బర్ఫీ, లడ్డూ లాంటి స్వీట్లు తింటే కలిగే ఆనందం రెట్టింపు అవుతుంది. కానీ.. ఇవి తిన్న వెంటనే మన నోరు మొత్తం తియ్యగా మారిపోతుంది. వెంటనే మంచినీరు తాగాలనే కోరిక కలుగుతుంది. చాలా మంది వెంటనే వాటర్ తాగేస్తూ ఉంటారు. కానీ, అసలు తీపి తిన్న వెంటనే మంచినీరు తాగడం ఆరోగ్యానికి మంచిదేనా? కలిగే మార్పులు ఏంటో చూద్దాం...
స్వీట్స్ లో చక్కెర మోతాదు ఎక్కువగా ఉంటుంది. మీరు స్వీట్లు తినగానే వెంటనే నీళ్లు తాగితే, ఆ చక్కెర త్వరగా ద్రవ రూపంలో శరీరంలోకి కలుస్తుంది. ఫలితంగా రక్తంలో షుగర్ లెవల్స్ వేగంగా పెరుగుతాయి. ఇది డయాబెటీస్ ఉన్నవారికి చాలా ప్రమాదకరం. అంతేకాదు, ఇలాంటి అలవాట్లు దీర్ఘకాలంగా కొనసాగితే, టైప్-2 డయాబెటీస్ రిస్క్ పెరుగుతుంది.
2. జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావం
స్వీట్లు తిన్న తర్వాత వెంటనే నీళ్లు తాగితే జీర్ణక్రియ మందగిస్తుంది. నీటి వల్ల ఆహారం జీర్ణమయ్యేందుకు అవసరమైన ఆమ్లాలు (digestive acids) బలహీనపడతాయి. ఇది అజీర్ణం, ఎసిడిటీ, గ్యాస్ వంటి సమస్యలకు దారితీస్తుంది. ప్రత్యేకంగా, స్వీట్ తిన్న తర్వాత జీర్ణ ప్రక్రియ మొదలు పెట్టడానికి కొంత సమయం అవసరం. వెంటనే నీళ్లు తాగితే ఆ ప్రక్రియలో అంతరాయం కలుగుతుంది. అందుకే వెంటనే కాకుండా.. ఒక పది నిమిషాల తర్వాత తాగడం మంచిది.
స్వీట్లలో ఉన్న అధిక కేలరీలు నీటితో కలిసి శరీరంలో కొవ్వుగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది బరువు పెరిగేందుకు దోహదం చేస్తుంది. రెగ్యులర్ గా ఇలా చేయడంలో... అధిక బరువు, ఒబేసిటీ వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇదే విషయాన్ని నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ లోనూ ధ్రువీకరించారు.
4. ఇన్‌సులిన్ నిరోధకత (Insulin Resistance) పెరిగే ప్రమాదం
రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగడం వల్ల, ప్యాంక్రియాస్ ఎక్కువగా ఇన్‌సులిన్ విడుదల చేస్తుంది. తరచూ ఇలా జరగడం వల్ల శరీరం ఇన్‌సులిన్‌కు స్పందించకుండా పోతుంది. దీని వల్ల టైప్-2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువవుతాయి.
5. మెటబాలిజం మందగిస్తుంది
మీటబాలిజం అనేది శరీరం తీసుకునే ఆహారాన్ని శక్తిగా మార్చే ప్రక్రియ. తీపి తిన్న వెంటనే నీరు తాగడం వల్ల ఈ ప్రక్రియ మందగిస్తుంది. ఇది శరీరంలోని శక్తి స్థాయిలను తగ్గించి, అలసట పెంచుతుంది. ఉత్సాహాన్ని తగ్గిస్తుంది.
తీపి తిన్న తర్వాత కనీసం 20-30 నిమిషాల తర్వాత నీరు తాగడం మంచిది. అలా చేస్తే శరీరానికి అవసరమైన జీర్ణ ఎంజైమ్ లు సరిగా పని చేస్తాయి. జీర్ణక్రియకు అంతరాయం కలగదు. అంతేకాక, మితంగా స్వీట్లను తినడం, తిన్న తర్వాత కొంతసేపు నడవడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.
ఫైనల్ గా...
స్వీట్లు తినడంలో తప్పు లేదు. కానీ తిన్న వెంటనే నీరు తాగడం ఆరోగ్యానికి శాపంగా మారుతుంది. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారు, జీర్ణక్రియ బలహీనంగా ఉండే వారు, బరువు పెరుగుతున్నవారు అయితే తప్పకుండా ఈ అలవాటు నుంచి బయటపడాలి. ఆహారం తినే తీరు మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. కాబట్టి మనం చేసే చిన్న పొరపాట్లు కూడా, కాలక్రమంలో పెద్ద సమస్యలుగా మారతాయి. అందుకే తీపి తిన్న వెంటనే నీటిని తాగకండి . ఇది ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం చేయాల్సిన ముఖ్యమైన మార్పుల్లో ఒకటి.