ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉన్నాడా లేదా అనేది అతని బరువును బట్టి ఈజీగా చెప్పొచ్చు అంటారు ఆరోగ్య నిపుణులు. జీవనశైలి మారుతున్న కొద్దీ ఊబకాయం పెరుగుతోంది. తిన్నది జీర్ణం కాకపోవడం, కొంచెం నడిచినా కాలు నొప్పి, నడుము నొప్పి సహా రకరకాల సమస్యలు రావడం ప్రస్తుతం సాధారణం అయిపోయింది.
అయితే, ఏ ఆరోగ్య సమస్య వచ్చినా ముందు చెప్పేది బరువు తగ్గాలి లేదా బరువు పెరగాలి. బరువు పెంచుకునే వాళ్లది ఒక రకమైన సమస్య అయితే తగ్గాలనుకునే వారిది మరోక రకమైన సమస్య. రెండూ కష్టంతో కూడుకున్నవే.
ఏ ఫుడ్ తింటే మంచిది?
బరువు తగ్గాలనుకునే వారు ముందుగా ఫాలో అయ్యేది వాకింగ్ తర్వాత జిమ్, యోగా చేస్తుంటారు. ఇంట్లో ఉంటే డైట్ చేయొచ్చు కానీ బయట ఉంటే? ఒకవేళ ప్రయాణాలు చేస్తుంటే? అప్పుడు ఏం చేయాలి? బరువు తగ్గడానికి ఏం తినాలో ఇక్కడ చూద్దాం.
ఓ అధ్యయనం ప్రకారం ప్రయాణం చేసేటప్పుడు లేదా బయట ఆహారం తీసుకునేటప్పుడు కొంచెం కఠినంగా ఉండాలి. ఫాస్ట్ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్ తినే బదులు ఇడ్లీ సాంబార్ తినచ్చు. బరువు తగ్గాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.
బరువు తగ్గడానికి ఇడ్లీ, సాంబార్
ఇడ్లీ, సాంబార్ బయట ఎక్కడైనా ఈజీగా దొరుకుతుంది. ఆరోగ్యానికి కూడా మంచిది. అంతేకాదు ఇడ్లీ సాంబార్ తింటూ బరువు కూడా తగ్గించుకోవచ్చు. వీటిని బియ్యం, మినపప్పు, అటుకులు నానబెట్టి రుబ్బి చేస్తారు. సాంబార్‌లో కూరగాయలు ఉంటాయి. కాబట్టి నిశ్చింతగా తినచ్చు. ఒకటి, రెండు ఇడ్లీలు ఎక్స్‌ట్రా తిన్నా సమస్య లేదు. కొబ్బరి చట్నీతో తింటే ఇంకా మంచిది.
మెరుగైన జీర్ణక్రియ
ఇడ్లీ, సాంబార్ కాంబినేషన్ బాగుంటుంది. వీటిలో ప్రోటీన్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అంతేకాదు బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి. రోజూ ఉదయాన్నే ఆఫీస్‌కి వెళ్లేవాళ్లు బయట తినాలంటే ఇడ్లీ తినడం మంచిది. బోర్ కొట్టినా సరే ఇడ్లీనే తినమని చెబుతుంటారు నిపుణులు. దీనివల్ల నెలకు కేజీ నుంచి 2 కేజీల వరకు బరువు ఈజీగా తగ్గొచ్చట.