Healthy Eating Tips: జామ పండును కేవలం నీటితో కడిగితే చాలదు, ఇలా క్లీన్ చేయాలి..

Published : Mar 04, 2026, 02:57 PM IST

Healthy Eating Tips: జామ పండంటే అందరికీ ఇష్టమే. ఇందులో విటమిన్ C, ఫైబర్ అధికంగా ఉంటుంది. అయితే చాలా మంది జామ పండును కేవలం నీటితో కడిగి తినేస్తుంటారు. కానీ అది సరిపోదు.  

PREV
15
జామపై కనిపించని మట్టి, ధూళి, బాక్టీరియా..

సాధారణంగా జామపళ్లంటే ఇష్టముండనివారు ఎవరూ ఉండరు. ఇంటికి తెచ్చుకునేప్పుడు జస్ట్ నీటిలో కడిగి తినేయడం సహజమే. కానీ అలా చేస్తే చాలదు. ఎందుకంటే కనిపించని మట్టి, ధూళి, బాక్టీరియా, ముఖ్యంగా పెస్టిసైడ్స్ అవశేషాలు ఉండిపోతాయి.

25
కడిగినా రసాయనాల అవశేషాలు

రైతులు పంటలు పండించేప్పుడు కీటకాలు నుండి రక్షించడానికి వివిధ రకాల మందులు చల్లుతారు. ఆ మందుల అవశేషాలు పళ్లపై ఉండిపోతాయి. మార్కెట్‌కి వచ్చే వరకూ ఎంతో మంది చేతులు మారుతుంది. దానివల్ల వాటిపై క్రిములు పేరుకుపోతాయి. కాబట్టి కేవలం నీటితో కడగడం వల్ల పైపైన ఉన్న మట్టిమాత్రమే పోతుంది. కానీ పెస్టిసైడ్స్ తాలుకా అవశేషాలు పూర్తిగా పోవు.

35
నీటిలో 10–15 నిమిషాలు నానబెట్టాలి

మొదటగా జామపండును నీటిలో బాగా కడగాలి. చేతులతో మెల్లగా రుద్దుతూ పైపైన ఉన్న ధూళి తొలగించాలి. ఆ తర్వాత ఒక గిన్నెలో నీరు తీసుకుని అందులో ఒక టీస్పూన్ ఉప్పు లేదా రెండు టీ స్పూన్ల వెనిగర్ కలపాలి. ఆ నీటిలో 10–15 నిమిషాలు నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల పెస్టిసైడ్స్ పోతాయి. క్రిములు నశిస్తాయి.

45
ఇంకో మంచి పద్ధతి-బేకింగ్ సోడాతో క్లీనింగ్

ఒక గిన్నె నీటిలో ఒక టీస్పూన్ బేకింగ్ సోడా కలిపి జామలను అందులో 10–15 నిమిషాలు నానబెట్టాలి. బేకింగ్ సోడా పెస్టిసైడ్స్ తొలగించడంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. నానబెట్టిన తర్వాత మళ్లీ శుభ్రమైన నీటితో బాగా కడగాలి.

55
ఎంత కడిగినా తొడిమల దగ్గర దుమ్ము

జామ తొక్క కొంచెం గట్టిగా, గుండ్రంగా ఉండటం వల్ల దుమ్ము కిందా, పైనా తొడిమల దగ్గర ఉండిపోతుంది. అందుకే సాఫ్ట్ వెజిటేబుల్ బ్రష్‌తో మెల్లగా రుద్దితే మరింత శుభ్రంగా అవుతుంది. అలా అని గట్టిగా రుద్దితే తొక్క పాడవుతుంది. 

కడిగిన తర్వాత జామలను శుభ్రమైన గుడ్డతో తుడిచి ఆరబెట్టాలి. పూర్తిగా పండిన జామలను ఫ్రిజ్‌లో ఉంచొచ్చు. కడగకుండా నేరుగా ఫ్రిజ్‌లో ఉంచడం మంచిది కాదు, ఎందుకంటే దుమ్ము ఇతర ఆహార పదార్థాలకు అంటుకునే అవకాశం ఉంది. కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఫ్రూట్స్ తినే ముందు క్రమ పద్ధతిలో క్లీన్ చేసుకోవడం చాలా ముఖ్యం.

Read more Photos on
click me!

Recommended Stories