Kitchen Hack: ఇలా చేస్తే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఎప్పటికీ పాడవ్వవు..

Published : Mar 03, 2026, 10:38 PM IST

Kitchen Hack: ఇంట్లోకి తెచ్చుకునే వెజిటేబుల్స్, ఫ్రూట్స్ పాడవటం ఎప్పుడూ ఉండే సమస్యే. బయటబాగా ఉన్నా లోపల కుళ్లిపోవడం, పురుగు పట్టేయడం, వాడిపోవడం జరుగుతుంటుంది. దానివల్ల ఫుడ్, మనీ రెండూ వృథా. సరైన పద్ధతిలో నిల్వ చేస్తే ఎక్కువరోజులు ఫ్రెష్ గా ఉంటాయి.

PREV
16
సరైన పద్ధతి పాటించకపోవడమే దీనికి కారణం

ఇంట్లో కూరగాయలు త్వరగా వాడిపోవడం అనేది చాలా సాధారణ సమస్య. రెండు రోజుల్లోనే కూరగాయలు వాడిపోవడం, వాసన రావడం, రంగు మారడం వల్ల వాటిని పారేయాల్సిన పరిస్థితి వస్తుంది. సరైన నిల్వ పద్ధతి పాటించకపోవడమే దీనికి ప్రధాన కారణం. కొన్ని సులభమైన చిట్కాలు పాటిస్తే కూరగాయలు ఎక్కువ రోజులు తాజాగా ఉంచుకోవచ్చు. 

26
తడి ఉండగా ఫ్రిజ్‌లో కుళ్లిపోవడం ఖాయం

కూరగాయలను కొన్న వెంటనే శుభ్రం చేసి ఫ్రిజ్‌లో పెడితే మంచిదని చాలామంది అనుకుంటారు. కానీ అన్ని కూరగాయలకు అది సరైన పద్ధతి కాదు. ఆకుకూరలు అయితే ముందుగా నీటితో తేలికగా కడిగి పూర్తిగా ఆరబెట్టాలి. తడి ఉండగా ఫ్రిజ్‌లో పెడితే త్వరగా కుళ్లిపోతాయి. ఆరిన తర్వాత పేపర్ టవల్‌లో చుట్టి గాలి చొరబడని డబ్బాలో ఉంచితే ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి.

36
ఈ మూడు కలిపి ఫ్రిజ్ లో పెట్టకూడదు

ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, వెల్లుల్లి వంటి కూరగాయలను ఫ్రిజ్‌లో పెట్టకూడదు. ఇవి చల్లని వాతావరణంలో త్వరగా పాడవుతాయి. వీటిని గాలి ప్రసరించే ప్రదేశంలో నిల్వ చేయాలి. ముఖ్యంగా బంగాళాదుంపలను ఉల్లిపాయలతో కలిపి ఉంచకూడదు. ఇలా ఉంచితే వాటికి మొలకలు వస్తాయి.

46
గాలి వెళ్లకపోతే తేమ పెరిగి పాడవుతాయి

క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్ వంటి కూరగాయలను ఫ్రిజ్‌లో స్టోర్ చేయాలి. కానీ వాటిని ప్లాస్టిక్ కవర్లలో గట్టిగా కట్టేయడం కంటే చిన్న చిన్న రంధ్రాలు ఉన్న కవర్లలో ఉంచడం మంచిది. గాలి వెళ్లకపోతే తేమ పెరిగి కూరగాయలు పాడవుతాయి.

56
దోసకాయలు, గుమ్మడికాయను గాలి చొరబడని డబ్బాలో పెట్టాలి

టమోటాలను పూర్తిగా పండిన తర్వాత మాత్రమే ఫ్రిజ్‌లో పెట్టాలి. పచ్చిగా ఉన్న టమోటాలను గది ఉష్ణోగ్రతలో ఉంచాలి. లేకపోతే టేస్ట్ మారిపోతుంది. అలాగే దోసకాయలు, గుమ్మడికాయ ముక్కలు కట్ చేసిన తర్వాత గాలి చొరబడని డబ్బాలో పెట్టాలి.

66
ఫ్రిజ్ టెంపరేచర్ కూడా ముఖ్యమే

కూరగాయలను ఎక్కువ రోజులు నిల్వ చేయాలంటే వాటిని వేర్వేరుగా ఉంచాలి. ఫ్రూట్స్, కూరగాయలను కలిపి పెట్టకూడదు. కొన్ని ఫ్రూట్స్ విడుదల చేసే గ్యాస్ వల్ల కూరగాయలు త్వరగా పాడవుతాయి.

ఫ్రిజ్ టెంపరేచర్ కూడా ముఖ్యమే. కూలింగ్ ఎక్కువైనా కొన్ని కూరగాయలు పాడయ్యే ప్రమాదం ఉంది. సరైన ఉష్ణోగ్రతలో ఉంచడం వల్ల వాటి ఫ్రెష్ నెస్ కోల్పోదు. వారానికి ఒకసారి ఫ్రిజ్‌ను శుభ్రం చేయడం కూడా అవసరం. సరైన నిల్వ పద్ధతి పాటిస్తే కూరగాయలు ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి. చిన్న జాగ్రత్తలతో ఆహారం వృథా కాకుండా కాపాడుకోవచ్చు. అలాగే మనీ కూడా సేవ్ అవుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories