Coffee: కాఫీని ఈ కాలం యువత ఎందుకు తాగుతున్నారు?
ఈ రోజుల్లో కాఫీ ని అమితంగా ఇష్టపడేవారు చాలా మంది ఉన్నారు. అసలు కాఫీ తాగడం మంచిదేనా? రోజూ తాగితే ఏమౌతుంది? నిపుణులు ఏమంటున్నారో చూద్దాం..
ఈ రోజుల్లో కాఫీ ని అమితంగా ఇష్టపడేవారు చాలా మంది ఉన్నారు. అసలు కాఫీ తాగడం మంచిదేనా? రోజూ తాగితే ఏమౌతుంది? నిపుణులు ఏమంటున్నారో చూద్దాం..
ఉదయం లేవగానే పొగలు కక్కే.. కమ్మని వాసనను ఇచ్చే కాఫీ తాగడం ఎవరికి మాత్రం నచ్చదు. కాఫీ తాగితే మనకు ఎక్కడా లేని ఉత్సాహం వచ్చేస్తుంది. అందుకే పెద్దవాళ్ల నుంచి యూత్ వరకు అందరూ ఈ కాఫీని తాగడానికి ఇష్టపడుతున్నారు. కాఫీల్లోనూ చాలా రకాలు ఉన్నాయి. యువత కాఫీ ఎక్కువగా తాగడం వల్ల కాఫీ బిజినెస్ కూడా బాగా పెరిగింది. కొత్త బ్రాండ్లు, స్పెషల్ కాఫీ షాపులు పుట్టుకువస్తున్నాయి. ఈ సంగతి పక్కన పెడితే.. అసలు కాఫీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? ఈ కాలం యువతకు కాఫీ తాగే అవసరం ఉందా లేదా? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
1. మెదడు పనితీరు మెరుగౌతుంది.
కాఫీ తాగితే వెంటనే హుషారు వస్తుంది. కెఫీన్ అనే పదార్థం మిమ్మల్ని అప్రమత్తంగా, శ్రద్ధగా ఉంచుతుంది. ఇప్పుడున్న ఫాస్ట్ లైఫ్ లో కాఫీ తాగితే మైండ్ ఫ్రెష్ అవుతుంది, రోజంతా పనిచేయడానికి రెడీగా ఉంటారు. ఆఫీసులో ఎక్కువసేపు పనిచేయాలన్నా, రాత్రిపూట చదవాలన్నా కాఫీ బాగా ఉపయోగపడుతుంది.
2. శారీరక సామర్థ్యం పెరుగుతుంది:
కాఫీలో ఉండే కెఫీన్ వల్ల శరీరంలో అడ్రినలిన్ లెవెల్స్ పెరుగుతాయి. దీనివల్ల గుండె వేగం, రక్తపోటు, కండరాలకు రక్త ప్రసరణ పెరుగుతాయి. వ్యాయామం చేసేటప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది. జిమ్ చేసే కుర్రాళ్లకి కాఫీ బెస్ట్ ఫ్రెండ్ లాంటిది.
3. డిప్రెషన్ రిస్క్ తగ్గుతుంది:
కాఫీ తాగితే డిప్రెషన్ వచ్చే అవకాశం తగ్గుతుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది. కాఫీలో ఉండే కెఫీన్ మన మెదడును మెరుగుపరుస్తుంది, డిప్రెషన్ లక్షణాలు రాకుండా చేస్తుంది. ఈ రోజుల్లో కుర్రాళ్ల లైఫ్ స్టైల్ చూస్తే ఇది చాలా అవసరం.