బాదం పప్పులను ఎలా తినకూడదో తెలుసా?

Published : Sep 27, 2025, 06:48 PM IST

Almond: బాదం పప్పులు ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిని రెగ్యులర్ గా తినడం వల్ల మన శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు అందుతాయి. కానీ బాదం పప్పులను కొన్ని ఫుడ్స్ తో మాత్రం తినకూడదు. దీనివల్ల మీ ఆరోగ్యం దెబ్బతింటుంది.

PREV
15
బాదం పప్పులను ఎలా తినకూడదు?

ఆరోగ్యకరమైన డ్రై ఫ్రూట్స్ లో బాదం పప్పులు ఒకటి. ఈ పప్పుల్లో హెల్తీ ఫ్యాట్స్, ప్రోటీన్లు, ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఈ బాదం పప్పులను రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తొక్కలను తీసేసి తింటే ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది. కానీ బాదం పప్పులను కొన్ని ఆహారాలతో కలిపి తినడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. దీనివల్ల మీకు అలెర్జీ లేదా జీర్ణ సమస్యలు, పిత్త, వాత దోషం వంటి అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అసలు బాదం పప్పులను వేటితో కలిపి తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

25
పాల ఉత్పత్తులతో బాదం పప్పులను తింటే

చాలా మంది బాదం పప్పులను పాలతో పాటుగా ఇతర పాల ఉత్పత్తులతో తింటుంటారు. కానీ ఈ రెండు జీర్ణం కావడానికి వేర్వేరు సమయం పడుతుంది. కాబట్టి ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల సమస్యలు వస్తాయి. ఈ బాదం పప్పులను పాలతో కలిపి లాక్టోస్ అసహనం ఉన్నవారికి కడుపు నొప్పి వస్తుంది.

 అలాగే పాలలో ఉండే ఒక రకమైన ప్రోటీన్ బాదం పప్పుల్లోని ఇనుము, మెగ్నీషియం వంటి ఖనిజాలను గ్రహించకుండా చేస్తుంది. ఆయుర్వేదం ప్రకారం.. ఈ కాంబినేషన్ వల్ల శ్లేష్మం ఉత్పత్తి పెరుగుతుంది. అందుకే బాదం పప్పులను పాలతో తీసుకోకూడదు.

ఆక్సలేట్ ఎక్కువగా ఉన్న ఆహారాలు

బాదం పప్పుల్లో ఆక్సలేట్ పుష్కలంగా ఉంటుంది. వీటిని గనుక ఎక్కువగా తింటే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి. అయితే ఈ బాదం పప్పులను ఆక్సలేట్ ఎక్కువగా ఉన్న ఆహారాలైనా పాలకూర, చిలగడదుంపలు వంటి ఆహారాలతో తింటే కిడ్నీ స్టోన్స్ వచ్చే రిస్క్ మరింత పెరుగుతుంది. ఇది కాల్షియం శోషణను నిరోధిస్తుంది కూడా. మీరు బాదం పప్పులను తినాలనుకుంటే గుమ్మడికాయ, క్యాబేజీ, కాలే వంటి కూరగాయలను తినండి. వీటివల్ల ఎలాంటి సమస్య రాదు.

35
ప్రాసెస్ చేసిన చక్కెర ఆహారాలు

బాదం పప్పులను మీరు ప్రాసెస్ చేసిన చక్కెర ఆహారాలతో అస్సలు తినకూడదు. పాస్ట్రీలు, డెజర్ట్‌లల్లో బాదం పప్పులను వేస్తుంటారు. కానీ వీటిలో ప్రాసెస్ చేసిన షుగర్ ఉంటుంది. వీటిని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు బాగా పెరుగుతాయి. అలాగే మీ జీవక్రియ కూడా నెమ్మదిస్తుందని నిపుణులు చెబుతున్నారు. 

బాదంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ప్రాసెస్ చేసిన కార్బోహైడ్రేట్లు దీర్ఘకాలిక మంటకు కారణమవుతాయి. అలాగే బాదం పప్పులను ప్రాసెస్ చేసిన చక్కెరలను కలిపి తింటే మీరు బరువు పెరిగిపోతారు.

సోయా ఉత్పత్తులు

బాదం, సోయా ఉత్పత్తులను కలిపి తీసుకోకూడదు. ఎందుకంటే సోయా ఉత్పత్తుల్లో జింక్, ఇనుము, కాల్సియం వంటి ఖనిజాలను అనుసంధానించే ఫైటేట్ లు ఉంటాయి. అయితే మీరు బాదం పప్పులను సోయా ఉత్పత్తులతో కలిపి తీసుకుంటే వీటిలోని పోషకాలు సరిగ్గా అందవు. బాదం, సోయాలో ఉండే ఫైటిక్ ఆమ్లం మన శరీరం ఇనుము, కాల్షియాన్ని గ్రహించకుండా చేస్తుంది. అందుకే ఈ రెండింటిని కలిపి తినకూడదని ఆరోగ్య నిపుణులు చెప్తారు.

45
సాల్టీ స్నాక్స్

సాల్టీ స్నాక్స్ తో కూడా బాదం పప్పులు తినకూడదు. చిప్స్, సాల్టెడ్ ప్రెట్జెల్స్ లో ఉప్పు ఎక్కువగా ఉంటుంది. కొన్ని సాల్టీ స్నాక్స్ లో బాదం పప్పులు కూడా ఉంటాయి. ఈ కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది. కానీ ఈ కాంబినేషన్ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. దీన్ని తినడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. దీంతో మీకు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. ఉప్పును ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో నీరు నిల్వ ఉండటం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. ప్రాసెస్ చేసిన ఆహారాల్లో అనారోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ పప్పుల్లో పోషకాలు కూడా తగ్గుతాయి.

ఆల్కహాల్

కొంతమంది మందు తాగేటప్పుడు స్నాక్స్ గా బాదం పప్పులను తింటుంటారు. కానీ ఈ కాంబినేషన్ మిమ్మల్ని అనారోగ్యం బారిన పడేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ కాంబినేషన్ వల్ల జీర్ణక్రియ దెబ్బతింటుది. జీవక్రియపై చెడు ప్రభావం పడుతుంది. అలాగే మలబద్దకం, డీహైడ్రేషన్ వంటి సమస్యలు కూడా వస్తాయి. ఆల్కహాల్ బాదం పప్పుల్లోని ఆరోగ్యకరమైన కొవ్వులు విచ్చిన్నం కాకుండా చేస్తుంది. అయితే బాదం, ఆల్కహాల్ రెండింటిలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటివల్ల మీరు బరువు పెరగొచ్చు.

55
సిట్రస్ పండ్లు

బాదం పప్పులను సిట్రస్ పండ్లతో కలిపి తినకూడదు. అంటే నిమ్మకాయ, నారింజ, ద్రాక్షపండ్లు వంటి సిట్రస్ పండ్లతో అస్సలు తినకూడదు. ఎందుకంటే సిట్రస్ పండ్లలో ఆమ్లం ఎక్కువగా ఉంటుంది. ఇది బాదం పప్పు జీర్ణంకాకుండా చేస్తుంది. ఈ కాంబినేషన్ వల్ల జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. అలాగే కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి, గ్యాస్ వంటి జీర్ణ సమస్యలు కూడా వస్తాయి. సిట్రస్ పండ్లలో విటమిన్ సి బాదం పప్పుల్లోని ఖనిజాలు మన శరీరానికి అందకుండా చేస్తాయి.

Read more Photos on
click me!

Recommended Stories