పాల అలెర్జీలు ఉన్నవారు..
చాలా మందికి పాలు, పాల ఉత్పత్తులతో అలర్జీ ఉంటుంది. అలాంటివారు కూడా మజ్జిగ తాగకుండా ఉండటమే మంచిది. పొరపాటున తాగితే వారి చర్మంపై దురద, దద్దుర్లు, శ్వాస సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి, వీరు కూడా మజ్జిగ తాగకూడదు.
జలుబు , దగ్గుతో బాధపడేవారు
ఆయుర్వేదం ప్రకారం, మజ్జిగ శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. శరీరంలో శ్లేష్మం మొత్తాన్ని పెంచుతుంది. అందువల్ల, జలుబు, జ్వరం లేదా దగ్గు వంటి శ్వాసకోశ సమస్యల విషయంలో దీనిని తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. మజ్జిగ తాగడం వల్ల గొంతు నొప్పి లేదా శ్లేష్మం పేరుకుపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి, దీనివల్ల దగ్గు , శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. ఇలాంటి సమయంలో కూడా మజ్జిగ తీసుకోకపోవడమే మంచిది.