Health tips: నిమ్మకాయ తొక్కను ఇలా వాడితే ఎన్ని లాభాలో తెలుసా?

Published : May 20, 2025, 04:03 PM IST

సాధారణంగా మనం నిమ్మకాయను వాడిన తర్వాత దాని తొక్కను పారేస్తుంటాం. కానీ దాని తొక్క కూడా ఆరోగ్యానికి మంచిదనే విషయం మీకు తెలుసా? అవును, నిమ్మ తొక్కలో లెక్కలేనన్ని ఔషధ గుణాలున్నాయి. మరి అవెంటో తెలుసుకుందామా.. 

PREV
14
నిమ్మ తొక్క వృధా అనుకోకండి! ఇలా వాడితే బోలెడు లాభాలు!
నిమ్మకాయ ప్రయోజనాలు

సాధారణంగా అందరి ఇళ్లలోనూ నిమ్మకాయ ఉంటుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ నిమ్మరసం తాగడానికి ఇష్టపడతారు. నిమ్మకాయను వివిధ రకాల వంటకాల్లో కూడా వాడతారు. నిమ్మకాయలో విటమిన్ సి ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీనిలోని పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది. ఉప్పు నీరు, నిమ్మరసం కలిపి పుక్కిలిస్తే నోటిలోని హానికర బ్యాక్టీరియా నశిస్తుంది. నిమ్మకాయతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో.. దాని తొక్కతో కూడా అన్నే ఉపయోగాలున్నాయి. అవెంటో ఇక్కడ చూద్దాం.

24
నిమ్మ తొక్కలోని పోషకాలు

నిమ్మకాయ కంటే దాని తొక్కలో ఎక్కువ పోషకాలుంటాయట. నిమ్మకాయ తొక్కలో విటమిన్ సి, కాల్షియం, పొటాషియం, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. వాటి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

కళ్లకు మంచిది

నిమ్మ తొక్కలోని విటమిన్ ఎ, కెరోటినాయిడ్లు కంటి ఆరోగ్యానికి చాలా మంచివి. ఇంకా.. దీనిలోని విటమిన్ సి వృద్ధాప్యంలో వచ్చే కంటి సమస్యలకు మంచి ఔషధంగా పనిచేస్తుంది.

గాయాలను నయం చేస్తుంది

నిమ్మ తొక్క బ్యాక్టీరియా వ్యాప్తిని అరికడుతుంది. కాబట్టి గాయాలు త్వరగా మానడానికి సహాయపడుతుంది. దీనిలోని సిట్రిక్ యాసిడ్ వల్ల డయాబెటిస్ ఉన్నవారికి వచ్చే పుండ్లు త్వరగా మానుతాయి. దీనికోసం, పుండ్లున్న చోట నిమ్మ తొక్కను రాయాలి.

34
చెమట దుర్వాసనను పోగొడుతుంది

నిమ్మ తొక్కలోని సిట్రిక్ యాసిడ్ బ్యాక్టీరియాను ఎదుర్కొంటుంది. కాబట్టి నిమ్మ తొక్క లోపలి భాగాన్ని చంకలకు రాస్తే దుర్వాసన రాదు. అలాగే, వేడి నీటిలో నిమ్మ తొక్క వేసి, ఆ నీటిని కాటన్ బట్టలో/ దూదిలో ముంచి చంకలకు రాస్తే దుర్వాసన పోతుంది.

మొటిమలను తగ్గిస్తుంది

నిమ్మ తొక్కలో క్రిములను చంపే గుణాలున్నాయి. తొక్కను వేడి నీటిలో వేసి, దానికి పుదీనా కూడా కలిపి బాగా మరిగించాలి. ఆ తర్వాత ఆ నీటిని ముఖానికి రాస్తే మొటిమలు రాకుండా ఉంటాయి.

మలబద్ధకానికి మంచిది

నిమ్మ తొక్కలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకానికి మంచి ఔషధం. ఇది అల్సర్‌ను నయం చేస్తుంది. బరువును నియంత్రణలో ఉంచుతుంది.

44
చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది

నిమ్మ తొక్కలోని కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం రక్తపోటును నియంత్రణలో ఉంచడానికి చాలా ఉపయోగపడతాయి. దీనిలోని ఫ్లేవనాయిడ్లు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి, గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి.

ఎముకలను బలపరుస్తుంది

నిమ్మ తొక్కలో కాల్షియం, విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల ఎముకలను కాపాడుతుంది.  

క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటుంది

నిమ్మ తొక్క మంచి యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. క్యాన్సర్, శరీర కణాలను దెబ్బతీసే వ్యాధుల నుంచి మనల్ని రక్షిస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories