గుమ్మడి గింజలు
గుమ్మడి గింజలు ప్రోటీన్ కు మంచి వనరు. వీటిలో ఫైబర్, మొక్కల ఆధారిత ప్రోటీన్, ఒమేగా -3 కొవ్వులు, రాగి, జింక్, ఇనుము, విటమిన్ ఎ, విటమిన్ బి వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. గుమ్మడికాయ విత్తనాలు ఆడవాళ్లకు చేసే మేలు ఎంతో. దీనిలో పీఎంఎస్ ను అధిగమించడానికి అవసరమయ్యే మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. మెగ్నీషియం పీరియడ్ నొప్పి, కడుపు ఉబ్బరం, మూడ్ స్వింగ్స్ నుంచి ఉపశమనం కలిగిస్తుంది. దీన్ని విటమిన్ బి6తో కలిపి వాడితే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఇది తలనొప్పిని కూడా తగ్గిస్తుంది.అలాగే కండరాలను సడలించి పీరియడ్స్ తిమ్మిరి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.