చలికాలం బ్లడ్ షుగర్ ను పెంచుతుంది.. డయాబెటీస్ కంట్రోల్ లో ఉండాలంటే ఈ ఫుడ్స్ ను ఖచ్చితంగా తినండి

First Published | Oct 31, 2023, 11:16 AM IST

చలికాలం వచ్చేసింది. చల్లని వాతావరణం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా ఈ సీజన్ లో డయాబెటిస్ పేషెంట్లు తమ ఆరోగ్యం పట్ల ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ వెదర్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ను పెంచుతుంది. 
 

blood sugar level

మారుతున్న సీజన్ లో దగ్గు, జలుబు, గొంతునొప్పితో పాటుగా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. అందుకే ఈ  సీజన్ లో మనల్ని మనం ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా డయాబెటీస్ పేషెంట్లు. అవును ఈ సీజన్ లో మధుమేహులు ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా బ్లడ్ షుగర్ లెవెల్స్ విపరీతంగా పెరుగుతాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మధుమేహులు చాలా కాలంలో సరైన ఆహారపు అలవాట్లను చేసుకోవాలి. ఇవి చలికాలంలో మీ రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి సహాయపడతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

క్యారెట్లు

చలికాలంలో ప్రతి మార్కెట్ లో క్యారెట్లు అందుబాటులో ఉంటాయి. ఇవి మనల్ని ఎన్నో రోగాలకు దూరంగా ఉంచుతాయి. చలికాలంలో డయాబెటిస్ పేషెంట్లు తమ రోజువారి ఆహారంలో క్యారెట్లను చేర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు. క్యారెట్లలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తప్రవాహంలో చక్కెర విడుదలను నెమ్మదింపజేస్తుంది. అలాగే మీ కడుపు ఎక్కువసేపు నిండుగా ఉండేలా చూస్తుంది. క్యారెట్లను సలాడ్ గా పచ్చి తినొచ్చు. లేదా క్యారెట్ అల్లం సూప్ లా కూడా తీసుకోవచ్చు. 
 


Image: Getty Images


దాల్చిన చెక్క

దాల్చినచెక్క ఫుడ్ రుచిని పెంచడానికి ఉపయోగిస్తుంటారు. అయితే ఈ మసాలా దినుసు ఆహారం రుచిని పెంచడంతో పాటుగా రక్తంలో చక్కెర స్థాయిలను కూడా నియంత్రించడానికి సహాయపడుతుంది. దాల్చిన చెక్కలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది. ఈ ఆక్సీకరణ ఒత్తిడి డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుంది తెలుసా? దాల్చినచెక్క గ్లూకోజ్, ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలను సాధారణీకరిస్తుంది. దీంతో డయాబెటిస్, గుండె జబ్బుల ముప్పు తగ్గుతుంది. 
 

ఉసిరి

ఉసిరికాయలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. ఉసిరి టైప్ 2 డయాబెటిస్ పేషెంట్లకు ఓ వరం. ఇందుకంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరిస్తుంది. అలాగే ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరుస్తుంది. ఈ ఉసిరిలో విటమిన్ సి లో కూడా సమృద్ధిగా ఉంటుంది. ఇది మీ ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది. ఉసిరి డయాబెటీస్ ఉన్నవారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఉసిరికాయను ఊరగాయ, మిఠాయి, చట్నీ లేదా జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు.
 

beetroot juice

బీట్ రూట్

డయాబెటీస్ పేషెంట్లకు బీట్ రూట్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. బీట్ రూట్ లో పొటాషియం, ఫైబర్, ఐరన్, మాంగనీస్, ఫైటోకెమికల్స్ వంటి ముఖ్యమైన ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఇలాంటి బీట్ రూట్ మీ రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడానికి ఎంతో సహాయపడుతుంది. అంతేకాదు ఇది శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను నియంత్రించడానికి కూడా సహాయపడుతుంది. 
 

orange juice

నారింజ

మధుమేహులకు నారింజ ఎంతో మేలు చేస్తుంది. నారింజలో  గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. అందుకే ఈ పండు డయాబెటిస్ పేషెంట్లకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ పండును సలాడ్ రూపంలో తీసుకోవచ్చు. లేదా ఇంట్లో తయరుచేసిన నారింజ జ్యూస్ ను తాగొచ్చు. 
 

Latest Videos

click me!