చికెన్ లేదా మటన్.. బరువు తగ్గడానికి ఏది బెటర్..!

First Published | Oct 29, 2023, 1:13 PM IST

చలికాలంలో బరువు తగ్గడం చాలా కష్టమైన పనే. ఎందుకంటే ఈ సీజన్ లో చెమట ఎక్కువగా పట్టదు. దీని వల్ల బరువు తగ్గడం, కొవ్వును కరిగించడం కష్టమవుతుంది. 
 

చలికాలంలో బరువు తగ్గడం అంత సులువు కాదు. అయితే బరువు తగ్గడానికి చికెన్, మటన్ ను తినడం పూర్తిగా మానేయాలని చాలా మంది చెప్తుంటారు. కానీ చెప్పినంత ఈజీగా చికెన్, మటన్ ను మానేయడం అంత సులువైన పని కాదు. కానీ వీటిలో మీరు బరువు తగ్గేందుకు ఒకటి బాగా సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. అదేంటంటే?
 

చికెన్ లోని పోషకాలు 

యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రకారం.. 100 గ్రాముల చికెన్ లో 3.12 కొవ్వు, 24.11 గ్రాముల ప్రోటీన్, 140 కేలరీలు ఉంటాయి. అందేకాదు దీనిలో విటమిన్ ఎ, విటమిన్ సి, కాల్షియం, ఇనుము, వంటి ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ఇవన్నీ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. 
 


mutton

మటన్ లోని పోషకాలు 

100 గ్రాముల మటన్ లో  3.5 గ్రాముల కొవ్వు, 57 మిల్లీ గ్రాముల సోడియం, 26 గ్రాముల ప్రోటీన్, 143 కేలరీలు ఉంటాయి. అలాగే విటమిన్ బి12, జింక్, ఐరన్ వంటి పోషకాలు మటన్ లో మెండుగా ఉంటాయి. ఇవి కూడా మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. 
 

CHICKEN


చికెన్ వర్సెస్ మటన్.. బరువు తగ్గడానికి ఏది బెటర్ అంటే? 

చికెన్ లో కంటే మటన్ లోనే కొవ్వు ఎక్కువగా ఉంటుంది. అందుకే బరువు తగ్గడానికి చికెన్ సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునేవారు లేదా బరువు తగ్గడానికి డైట్ ను ఫాలో అవుతున్న వారు మటన్ కాకుండా చికెన్ నే తినాలని నిపుణులు చెబుతున్నారు. అయితే మటన్ లో చికెన్ కంటే ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. కానీ చికెన్ లో కేలరీలు తక్కువగా ఉంటాయి. కేలరీలు ఎక్కువగా ఉంటే బరువు పెరిగే అవకాశం ఉంది. అందుకే బరువు తగ్గాలనుకునేవారికి మటన్ కంటే చికెనే బెటర్. 
 

బరువు తగ్గడానికి చికెన్ ఎలా తినాలి?

బరువు తగ్గాలనుకునే వారు చికెన్ ను ఎన్నో విధాలుగా తినొచ్చు. బరువు తగ్గాలనుకుంటే చికెన్ రోల్స్, చికెన్ సూప్, గ్రిల్డ్ చికెన్ ను తినొచ్చు. పెరుగు చికెన్ ను మీ ఆహారంలో చేర్చుకున్నా బరువు తగ్గుతారు. మీరు బరువు తగ్గాలనుకుంటే వారానికి రెండుసార్లు 100 గ్రాముల చికెన్ తినొచ్చని నిపుణులు చెబుతున్నారు. 

Latest Videos

click me!