Ginger Garlic Paste: ఒక్కసారి చేస్తే చాలు.. హోటల్ స్టైల్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, నెలలపాటు నిల్వ ఉండే టెక్నిక్

Published : Jul 24, 2026, 05:55 PM IST

Ginger Garlic Paste: రోజూ అల్లం-వెల్లుల్లి పేస్ట్ తయారు చేయడం కష్టంగా ఉందా? ఈ సింపుల్ షెఫ్ ట్రిక్ మీ కోసమే. సరైన నిష్పత్తిలో తయారు చేసి నిల్వ చేస్తే  4 నుంచి 6 నెలల వరకు పేస్ట్ తాజాగా ఉంటుంది. సమయం ఆదా కావడంతో పాటు వంట కూడా మరింత ఈజీ అవుతుంది.

PREV
14
హోటల్ స్టైల్ అల్లం-వెల్లుల్లి పేస్ట్

రోజూ అల్లం-వెల్లుల్లి పేస్ట్ తయారు చేయడం వల్ల సమయం వృథా అవుతుందా? అయితే ఈ సింపుల్ కిచెన్ ట్రిక్ మీ కోసమే. ఒక్కసారి తయారు చేస్తే 4 నుంచి 6 నెలల వరకు తాజాగా నిల్వ ఉంటుంది. రుచి, సువాసన ఏ మాత్రం తగ్గకుండా ఉపయోగించుకోవచ్చు. షెఫ్ చెప్పిన ఈ ఈజీ పద్ధతిని తప్పకుండా ట్రై చేయండి.

24
వెల్లుల్లి పొట్టు తీయడానికి ఈజీ ట్రిక్

వెల్లుల్లిని చిన్న ముక్కలుగా కోసి, ఒక పళ్లెంలో వేసి 2-3 చెంచాల కార్న్‌ఫ్లోర్ లేదా మైదా కలపండి. ఇలా చేయడం వల్ల పొట్టు, వెల్లుల్లి సులభంగా వేరవుతాయి. రుచికరమైన పేస్ట్ కోసం సరైన కొలతలు ముఖ్యం. 1 కిలో వెల్లుల్లికి 400-500 గ్రాముల అల్లం వాడాలి. సమానంగా వాడితే రుచి దెబ్బతింటుంది.

34
నీళ్లు లేకుండా పేస్ట్ ఎలా తయారు చేయాలి?

శుభ్రం చేసిన అల్లం, వెల్లుల్లి ముక్కలను మిక్సర్ జార్‍లో వేయండి. రుబ్బేటప్పుడు నీళ్లు అస్సలు కలపకండి. నీరు లేకుండా మెత్తగా పేస్ట్ చేసుకుంటే రుచి బాగా ఉంటుంది. అలాగే పేస్ట్ ఎక్కువ రోజులు తాజాగా నిల్వ ఉంటుంది. పాడయ్యే అవకాశాలు కూడా చాలా వరకు తగ్గుతాయి. ఈ చిన్న చిట్కాతో 4 నుంచి 6 నెలల వరకు సులభంగా ఉపయోగించవచ్చు.

44
6 నెలల పాటు పేస్ట్ నిల్వ ఉంచే రహస్యం.

తయారైన అల్లం-వెల్లుల్లి పేస్ట్ లో ఒక కప్పు వంట నూనె కలపండి. నూనె పొరలా పనిచేసి తాజాగా ఉండేందుకు సహాయపడుతుంది. తర్వాత పేస్ట్ ను శుభ్రమైన గాజు లేదా స్టీల్ డబ్బాలోకి తీసుకోండి. మూతను గట్టిగా మూసి ఫ్రిజ్ లో పెట్టండి. ఇలా చేస్తే పేస్ట్ ఎక్కువ కాలం పాడవకుండా ఉంటుంది. అవసరమైనప్పుడల్లా శుభ్రమైన పొడి చెంచాతో మాత్రమే తీసుకుని వాడుకోండి.

Read more Photos on
click me!

Recommended Stories