3. పేపర్ టవల్ లేదా కాటన్ క్లాత్ వాడకం
పాలకూరను ఎక్కువ కాలం తాజాగా ఉంచడానికి, దాన్ని పొడి పేపర్ టవల్‌లో లేదా కాటన్ క్లాత్‌లో చుట్టాలి. ఇది ఆకుల్లోని అదనపు తేమను పీల్చుకుంటుంది. ఆ తర్వాత, దాన్ని ఒక ఎయిర్-టైట్ డబ్బాలో లేదా జిప్-లాక్ బ్యాగ్‌లో పెట్టి ఫ్రిజ్‌లోని వెజిటబుల్ డ్రాయర్‌లో ఉంచండి.
4. పాడైన ఆకులను వేరు చేయాలి
పాలకూరను నిల్వ చేసే ముందు, కట్టలో కుళ్లిన లేదా పసుపు రంగులోకి మారిన ఆకులను ఏరి పడేయండి. ఒక్క ఆకు పాడైనా, అది మొత్తం కట్టను త్వరగా పాడు చేస్తుంది.
5. పండ్లకు దూరంగా పెట్టాలి
పాలకూరను యాపిల్స్, అరటిపండ్లు లేదా పియర్స్ వంటి పండ్ల దగ్గర పెట్టొద్దు. ఈ పండ్ల నుంచి విడుదలయ్యే 'ఇథిలీన్' వాయువు, ఆకుకూరలు త్వరగా వాడిపోయేలా చేస్తుంది.