చెరకు రసంలో పోషకాలు..
చెరకు రసంలో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పోటాషియం వంటి ఖనిజాలు ఉన్నాయి. ఇవి ఎముకల బలం, నరాల ఆరోగ్యం, హృదయ పనితీరు, మరియు జీర్ణక్రియలో కీలక పాత్ర పోషిస్తాయి.
అలాగే, చెరకు రసంలో ఉండే ఐరన్.. శరీరంలో హీమోగ్లోబిన్ స్థాయిని పెంచి రక్తహీనతను నివారించడంలో సహాయపడుతుంది. ఇందులో విటమిన్ C ఉండటంతో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. చెరకు రసం ఆల్కలైన్ నేచర్ కలిగి ఉండటంతో శరీరంలోని ఆమ్లతను తగ్గించి, కాలేయాన్ని శుభ్రపరచడంలో సహాయపడుతుంది. ఇది శరీర డీటాక్స్‌కూ సహకరిస్తుంది. చెరకు రసం తాగడం వల్ల చర్మం మెరిసిపోతుంది, మూత్ర సంబంధిత సమస్యలు తగ్గుతాయి. దీనిలో ఉండే చిన్న మొత్తంలో ఆమినో ఆమ్లాలు శరీర కణాల నిర్మాణానికి ఉపయుక్తంగా ఉంటాయి. అయితే, డయాబెటిస్ ఉన్నవారు చెరకు రసం తాగేముందు డాక్టర్ సలహా తీసుకోవాలి. బయట విక్రయించే చెరకు రసం శుభ్రంగా ఉంటేనే తీసుకోవాలి, లేదంటే వ్యాధులు వస్తాయి. మొత్తానికి, చెరకు రసం రుచి, శక్తి, ఆరోగ్యం అన్నింటినీ కలిపి ఒకే సారి అందించే సహజ పానీయం అని చెప్పవచ్చు.