చికెన్ 65కి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా.. ఇందులో 65 అంటే ఏంటి..?

Published : Oct 31, 2025, 11:46 AM IST

Fun Fact: చికెన్ 65కి ఎంతో ఆద‌ర‌ణ ఉంద‌నే విష‌యం తెలిసిందే. ఈ ప్ర‌త్యేక‌మైన డిష్‌ను నాన్ వెజ్ ప్రియులు ఎంతో ఇష్టంగా తింటుంటారు. ఇంత‌కీ వంట‌కానికి ఈ పేరు ఎలా వ‌చ్చిందో ఎప్పుడైనా ఆలోచించారా.? 

PREV
15
చికెన్ 65 అంటే ఏంటి?

నాన్‌వెజ్ ప్రేమికులెవరైనా ఉంటే “చికెన్ 65” పేరు వినకపోవడం అసాధ్యం. ఇది భారతదేశవ్యాప్తంగా ఎంతో పాపులర్‌ అయిన ఫ్రైడ్‌ చికెన్‌ వంటకం. సాధారణంగా స్టార్టర్‌గా లేదా రూమాలి రొట్టెతో వడ్డిస్తారు. దీని మసాలా, రుచి, సువాసన వల్ల చాలా మంది అభిమానులను సంపాదించుకుంది. కానీ “65” అనే సంఖ్య ఎందుకు ఉందో ఎప్పుడైనా ఆలోచించారా?

25
చికెన్ 65 ఆవిర్భావం

చాలామంది ఈ పేరుకు కారణం వంటకంలో వాడే పదార్థాలు అని అనుకుంటారు. కానీ అసలు కథ వేరేలా ఉంది. 1965లో తమిళనాడులోని చెన్నైలో A.M. Buhari అనే వ్యక్తి ఈ వంటకాన్ని రూపొందించారు. ఈ వంటకం ఆయన Buhari Hotel మెనూలో భాగంగా ప్రవేశపెట్టారు. తర్వాత అదే హోటల్‌లో Chicken 78, Chicken 82, Chicken 90 లాంటి కొత్త వెర్షన్లు కూడా వచ్చాయి. ఇప్పటికీ Buhari Hotelలో చికెన్ 65, చికెన్ 90 వంటకాలు అందుబాటులో ఉన్నాయి.

35
“65” అనే పేరు ఎందుకు వచ్చింది?

“65” సంఖ్యకు అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. ప్రధానంగా ఇది 1965లో పుట్టిన వంటకం కాబట్టి “చికెన్ 65” అని పేరు పెట్టారు. కొందరు చెబుతున్నట్లు చికెన్‌ను 65 ముక్కలుగా కట్‌ చేశారని లేదా 65 రోజుల పాటు మరినేట్‌ చేశారని అంటారు. మరో కథ ప్రకారం, చెన్నైలోని సైనిక కాంటీన్‌లో మెనూలో ఈ వంటకం 65వ నంబర్‌గా ఉండేది. భాషా సమస్య కారణంగా సైనికులు ఆ సంఖ్య ద్వారా సులభంగా గుర్తుంచుకునేవారు. అందుకే ఈ పేరుతో పాపులర్‌ అయింది.

45
చికెన్ 65 తయారీ విధానం తెలుసుకుందామా.?

ఇందుకు కావాల్సిన పదార్థాలు:

చికెన్ ముక్కలు – 1 కప్పు

పెరుగు – ½ కప్పు

అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టేబుల్‌ స్పూన్‌

కరివేపాకు, కొత్తిమీర తరిగినవి – ఒక్కో టేబుల్‌ స్పూన్‌

మిరియాల పొడి – ½ టీ స్పూన్‌

జీలకర్ర పొడి – 1 టీ స్పూన్‌

ఎర్ర మిరప పొడి – 1 టేబుల్‌ స్పూన్‌

బియ్యపు పిండి – 3 టేబుల్‌ స్పూన్లు

పచ్చిమిరపకాయలు – 2

వెల్లుల్లి – 5 రెబ్బలు

కరివేపాకు – 1 కొమ్మ

ఉప్పు – తగినంత

నూనె – వేయించడానికి

55
తయారీ విధానం:

చికెన్ ముక్కలను ఒక బౌల్‌లో వేసి, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా పొడులు, కరివేపాకు, కొత్తిమీర వేసి బాగా కలపాలి. మూతపెట్టి కొంతసేపు మరినేట్‌ చేయాలి. తర్వాత బియ్యపు పిండి వేసి మళ్లీ కలపాలి. కడాయిలో నూనె వేడి చేసి చికెన్ ముక్కలను ఒక్కోసారి వేయించి గోల్డెన్‌ కలర్‌ వచ్చే వరకు ఫ్రై చేయాలి. వేయించిన చికెన్‌ను తీసి ఒక ప్లేట్‌లో పెట్టాలి. మరో పాన్‌లో కొద్దిగా నూనె వేసి పచ్చిమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు వేసి తాళింపు చేయాలి. ఇప్పుడు ఈ తాళింపులో వేయించిన చికెన్‌ను వేసి రెండు నిమిషాలు కలపాలి. అంతే ఎంతో రుచిక‌ర‌మైన చికెన్ 65 ర‌డీ అయిన‌ట్లే.

Read more Photos on
click me!

Recommended Stories