Chapati Dough: చపాతీ పిండిని ఒకేసారి ఎక్కువగా కలిపి పెట్టుకుంటున్నారా? కానీ మరుసటి రోజుకు పిండి నల్లగా, గట్టిగా మారుతోందా? ఈ చిన్న చిట్కా ఫాలో అయితే రెండు రోజులైనా పిండి తాజాగా ఉంటుంది..
మన దేశంలో అన్నం తర్వాత ఎక్కువ మంది తినేది చపాతీ, రోటీలు. అయితే.. రోజూ చపాతీ చేయడం కష్టంగా ఉంటుంది. ముఖ్యంగా పిండి కలపడం చాలా పెద్ద పని. అందుకే.. ఒకేసారి ఎక్కువ పిండి కలిపి ఉంచుకుంటారు. అయితే… అలా కలిపిన పిండిని సరిగా స్టోర్ చేయకపోతే ఆ పిండి నల్లగా మారుతుంది. లేదా గట్టిగా రాయిలా తయారౌతుంది. లేదా ఒక రకమైన వాసన వస్తుంది.
ఇలా జరగకుండా ఉండాలంటే.. పిండి కలుపుకునే సమయంలో కొన్ని సింపుల్ చిట్కాలు ఫాలో అయితే చాలు. ఈ సింపుల్ చిట్కాలతో రెండు రోజులైనా పిండి తాజాగా ఉంటుంది.
25
పిండి కలిపేటప్పుడు ఈ విషయాలు గుర్తుంచుకోండి
గోరువెచ్చని నీళ్లు: పిండి కలపడానికి గోరువెచ్చని నీళ్లు వాడితే చపాతీలు మెత్తగా వస్తాయి.
సరైన పద్ధతి: నీళ్లను ఒకేసారి కాకుండా, కొద్దికొద్దిగా పోస్తూ కలపాలి. పిండి మరీ మెత్తగా లేదా మరీ గట్టిగా ఉండకూడదు.
బాగా కలపాలి: కనీసం 5-10 నిమిషాల పాటు పిండిని బాగా నొక్కితే చపాతీలు చక్కగా పొంగుతాయి.
35
పిండిని నిల్వ చేసే ముందు ఏం చేయాలి?
నూనె లేదా నెయ్యి పూత: పిండి కలిపిన తర్వాత, దానిపై కొద్దిగా నూనె లేదా నెయ్యి రాయాలి. ఇది పిండి ఆరిపోకుండా, నల్లబడకుండా కాపాడుతుంది.
గాలి తగలకుండా మూతపెట్టాలి: పిండిని క్లింగ్ ర్యాప్ (Cling wrap) లేదా తడి బట్టతో కప్పి ఉంచాలి. గాలి తగిలితే పిండి త్వరగా ఆక్సిడైజ్ అయి నల్లగా మారుతుంది.
ఎయిర్‌టైట్ డబ్బా వాడండి: పిండిని స్టీల్ లేదా గాజు ఎయిర్‌టైట్ డబ్బాలో పెట్టి ఫ్రిజ్‌లో ఉంచాలి.
వాడే ముందు: ఫ్రిజ్‌లోంచి తీసిన వెంటనే చపాతీలు చేయొద్దు. చేయడానికి 30 నిమిషాల ముందు బయట పెట్టాలి. పిండి సాధారణ ఉష్ణోగ్రతకు వచ్చాక, కొద్దిగా కలిపి చపాతీలు చేస్తే మెత్తగా వస్తాయి.
55
పిండిని ఎన్ని రోజులు ఉంచవచ్చు?
పిండిని సరిగ్గా నిల్వ చేస్తే 24 నుంచి 48 గంటల వరకు తాజాగా ఉంటుంది.
పిండి ఎందుకు నల్లగా మారుతుంది?: గాలి, తేమ తగిలినప్పుడు పిండి ఆక్సిడైజ్ అయి రంగు మారుతుంది. నల్లబడిన పిండి వాడొచ్చా?: వద్దు. రంగు మారిన లేదా వాసన వచ్చిన పిండిని వాడటం ఆరోగ్యానికి హానికరం.