వయస్సుతో పాటు మెదడు పనితీరు తగ్గడం సహజమే. అయితే రోజువారీ ఆహారపు అలవాట్లు ఈ ప్రభావాన్ని కొంతవరకు తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు. కొన్ని సూపర్ ఫుడ్స్ జ్ఞాపకశక్తి, ఏకాగ్రతను పెంచుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. మరి ఆ సూపర్ ఫుడ్ ఏంటో చూద్దాం.
వయస్సుతో పాటు మెదడు పనితీరు తగ్గడం సహజమే. అయితే రోజువారీ ఆహారపు అలవాట్లు ఈ ప్రభావాన్ని కొంతవరకు తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు. కొన్ని సూపర్ ఫుడ్స్ జ్ఞాపకశక్తి, ఏకాగ్రతను పెంచుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. మరి తినే ఆహారంలో సూపర్ ఫుడ్ ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
మెదడు ఆరోగ్యం కేవలం జ్ఞాపకశక్తికే కాదు, మన భావోద్వేగాలు, ఆలోచనా శక్తి, ఏకాగ్రతకు కూడా కీలకం. వయస్సు పెరిగే కొద్దీ మెదడులో సహజ మార్పులు చోటుచేసుకుంటాయి. అయితే కొన్ని ప్రత్యేక ఆహారాలు మెదడు ఆరోగ్యానికి సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. రోజువారీ ఆహారంలో ఈ 10 సూపర్ ఫుడ్స్ చేర్చితే మెదడు పనితీరు మెరుగుపడే అవకాశం ఉందని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
24
బ్లూబెర్రీస్, ఆకుకూరలు, సాల్మన్ చేప, బీన్స్..
మొదటగా బ్లూబెర్రీస్: యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే బ్లూబెర్రీస్ మెదడును ఒత్తిడినుంచి రక్షిస్తాయి. వృద్ధాప్యంతో సంబంధం ఉన్న జ్ఞాపకశక్తి కోల్పోకుండా ఇవి ఉపయోగపడతాయని పరిశోధనలు చెబుతున్నాయి.
పాలకూర, కాలే, అరుగూలా వంటి ఆకుకూరల్లో ఫోలేట్, విటమిన్ K పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజూ ఒక కప్పు ఆకుకూరలు తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ మెండుగా ఉన్న సాల్మన్ చేప వల్ల....మెదడు అభివృద్ధి, జ్ఞాపకశక్తికి అవసరం. వాపు తగ్గించడంలో కూడా ఇది సహాయపడుతుంది.
బీన్స్: మెదడుకు అవసరమైన స్థిరమైన గ్లూకోజ్‌ను అందించే బీన్స్‌లో ఫోలేట్, బి విటమిన్లు అధికంగా ఉంటాయి. ఇవి మెదడు చురుకుదనాన్ని పెంచుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
34
డార్క్ చాక్లెట్, కాఫీ, టీ, పసుపు
డార్క్ చాక్లెట్: ఫ్లేవనాయిడ్లు సమృద్ధిగా ఉండే డార్క్ చాక్లెట్ మెదడుకు రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. జ్ఞాపకశక్తి, సమస్య పరిష్కార నైపుణ్యాలపై సానుకూల ప్రభావం చూపవచ్చని నిపుణుల అభిప్రాయ పడుతున్నారు.
కెఫిన్, యాంటీఆక్సిడెంట్లు ఉన్న కాఫీ, టీ చురుకుదనం పెంచుతాయి. ముఖ్యంగా టీలో థియనిన్ అనే ఫైటోకెమికల్ కూడా ఉంటుంది, ఇది ఉత్తేజపరిచే ప్రభావాన్ని కలిగి ఉంటుంది.
కర్కుమిన్ ఉన్న పసుపులో ఉండే శోథ నిరోదక శక్తి వల్ల మెదడు వాపును తగ్గిస్తుంది. జ్ఞాపకశక్తిని పెంచడంలో ఇది ఉపయోగకరం అని పరిశోధనలు సూచిస్తున్నాయి.
ఆహారాలు ఒక్కటే పరిష్కారం కాదు, దానికి తగ్గ , వ్యాయామం, నిద్ర ముఖ్యమే
టమోటాలు: లైకోపీన్ సమృద్ధిగా ఉండే టమోటాలు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. వండిన టమోటాల్లో లైకోపీన్ మరింతగా లభిస్తుంది.
విటమిన్ E, ఆరోగ్యకరమైన కొవ్వులు కలిగిన పిస్తాపప్పులు మెదడును రక్షించడంలో సహాయపడతాయి. అయితే మోతాదులో తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఈ ఆహారాలు ఒక్కటే పరిష్కారం కాకపోయినా, సమతుల ఆహారం, వ్యాయామం, సరైన నిద్రతో కలిపి తీసుకుంటే మెదడు ఆరోగ్యానికి మేలు చేసే అవకాశం ఉంది. మెదడు చురుకుదనం, జ్ఞాపకశక్తి కాపాడుకోవాలంటే ఆహారపు అలవాట్లలో చిన్న మార్పులు కూడా పెద్ద ఫలితాలు ఇస్తాయి. నిపుణులు సూచించిన ఈ సూపర్ ఫుడ్స్‌ను రోజువారీ ఆహారంలో చేర్చడం మంచిదని చెబుతున్నారు.