సండే వచ్చింది అంటే చాలు.. దాదాపు ప్రతీ ఇంట్లో మటన్ గుమగుమలు రావాల్సిందే. మటన్ వెరైటీస్ ఉండాల్సిందే. అయితే చికెన్ తో పోలిస్తే మటన్ కాస్త లేటుగా ఉడుకుతుంది. కానీ మటన్ కూడా ఫాస్ట్ గా, మెత్తగా ఉడికే ట్రిక్స్ కొన్ని ఉన్నాయి. అవేంటో ఇక్కడ చూద్దాం.
వీకెండ్ వచ్చిందంటే చాలు.. మనలో చాలామందికి నాన్‌వెజ్ ఉండాల్సిందే. చికెన్ అయితే 15-20 నిమిషాల్లో ఉడికిపోతుంది. కానీ మటన్ ఉడకడానికి కాస్త ఎక్కువ టైమ్ పడుతుంది. కొన్నిసార్లు ప్రెషర్ కుక్కర్ లో నాలుగైదు విజిల్స్ వచ్చినా మటన్ సరిగా ఉడకదు. ముక్క సరిగా ఉడక్కపోతే కూర టేస్ట్ మొత్తం పాడవుతుంది. మరి అంత ధర పెట్టి కొనుగోలు చేసిన మటన్ ని ఊరికే పాడుచేస్తే ఏం బాగుంటుంది చెప్పండి. అందుకే కొన్ని సింపుల్ చిట్కాలతో మటన్ ని త్వరగా ఎలా వండాలో ఇక్కడ చూద్దాం.
25
వేడి నీళ్లతో కడగడం
మటన్ కొనేటప్పుడే అది లేతదా, ముదురుదా అని కచ్చితంగా అడిగి తెలుసుకోవాలి. సాధారణంగా లేత మాసం కాస్త త్వరగా ఉడుకుతుంది. ముదురు మాంసం ఉడకడానికి కాస్త టైం పడుతుంది. అలాగే అది మేక మాంసమా, గొర్రె మాంసమా అని కూడా నిర్ధారించుకోవాలి. మటన్ ని ఇంటికి తెచ్చాక, రెండు మూడు సార్లు వేడి నీటితో కడగాలి. పొరపాటున కూడా చల్లటి నీళ్లు వాడొద్దు. చల్లటి నీటితో కడిగితే మటన్ ఉడకడానికి ఇంకా ఎక్కువ సమయం పడుతుంది. వేడి నీళ్లు మటన్ ని త్వరగా ఉడికేలా చేస్తాయి.
35
చిన్న చిన్న ముక్కలుగా..
వేడి నీటితో కడిగిన తర్వాత, మటన్‌ని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఇలా చేస్తే ముక్కలన్నీ సమానంగా ఉంటాయి. త్వరగా, మెత్తగా ఉడుకుతాయి. మటన్ వండటానికి నార్మల్ కడాయి కంటే కూడా కుక్కర్ వాడటం మంచిది. ప్రెషర్ కుక్కర్ లో మటన్ త్వరగా ఉడుకుతుంది. అయితే హై ఫ్లేమ్ పై కాకుండా, తక్కువ మంట మీద ఉడికిస్తే మటన్ చక్కగా ఉడుకుతుంది.
మటన్‌ను ఉడికించేటప్పుడు మొదట్లోనే మసాలాలు వేయొద్దు. సరిపడా ఆయిల్, చిటికెడు పసుపు, కాస్త అల్లం తురుము వేస్తే చాలు. అల్లంలోని కొన్ని గుణాలు మటన్ ని త్వరగా ఉడికేలా చేస్తాయి. మటన్ కాస్త ఉడికిన తర్వాత మసాలాలు కలుపుకోవచ్చు. అలాగే ఉప్పు వేసే విధానం కూడా ఇందులో ముఖ్యమే. ఉప్పును ముక్క సగం ఉడికాక వేస్తే ముక్కలు గట్టిపడకుండా ఉంటాయి.
55
గోరువెచ్చని నీళ్లు
మటన్ కూర వండేటప్పుడు మధ్య మధ్యలో కొద్దికొద్దిగా నీళ్లు పోయాల్సి ఉంటుంది. కానీ చల్లటి నీళ్లు పోయకూడదు. బదులుగా గోరువెచ్చని నీళ్లు పోయడం మంచిది. దీనివల్ల మటన్ ఉడకడానికి ఎక్కువ సమయం పట్టదు. వేడిగా ఉన్న మటన్‌లో చల్లటి నీళ్లు పోస్తే, ఉడికే ప్రక్రియ నెమ్మదిస్తుంది. ఇలా ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే గ్యాస్ ఆదా కావడంతో పాటు మటన్ త్వరగా, మెత్తగా ఉడుకుతుంది, రుచిగా ఉంటుంది.