Chandramukhi Chicken Fry: నార్మల్ చికెన్ ఫ్రై బోర్ కొట్టిందా? ఈ చంద్రముఖి చికెన్ ఫ్రై ట్రై చేయండి.. టేస్ట్ అదిరిపోద్ది

Published : Jun 08, 2026, 04:00 PM IST

Chandramukhi Chicken Fry: చికెన్ కర్రీ, ఫ్రై, గ్రేవీ..అందరూ చేస్తారు. కానీ దేని తర్వాత ఏది వేయాలి, ఎంత కుక్ అవ్వాలి, కారం, ఉప్పు, మసాలాలు ఎంత వేయాలో పర్ఫెక్ట్ గా తెలిస్తే..ఇంకా అదిరిపోద్ది. ఒక్కసారి ఈ చికెన్ ఫ్రై ట్రై చేయండి. మళ్లీ మళ్లీ తింటారు. 

PREV
17
చంద్రముఖి చికెన్ ఫ్రై

స్పైసీగా, క్రిస్పగా, మసాలా ఘాటుతో నోరూరించే చికెన్ ఫ్రై తినాలనిపిస్తోందా? అయితే ఈ ఆంధ్రా-తమిళనాడు స్టైల్ చంద్రముఖి చికెన్ ఫ్రై ట్రై చేసి చూడండి. బయట క్రిస్పీగా, లోపల జ్యూసీగా ఉండి..తింటుంటే నోట్లో బ్లాస్టేనంటే నమ్మండి. రెస్టారెంట్ స్టైల్ లో ఉంటుంది. చూడగానే ఆ స్పైసీనెస్, ఘాటైన ఘుమఘుమలు మిమ్మల్ని మరో లోకానికి తీసుకెళ్తాయి.

27
కావలసిన పదర్థాలు

750 గ్రాముల చికెన్, ఒకటిన్నర కప్పు నీళ్లు, సరిపడా పసుపు, ఉప్పు, 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్, 3 లవంగాలు, సగం అనాస పువ్వు ముక్క, రెండు యాలకులు, అంగుళంన్నర దాల్చినచెక్క, టీ స్పూన్ మిరియాలు, టీ స్పూన్ జీలకర్ర, మూడు ఎండుమిర్చి, రెండు టేబుల్ స్పూన ధనియాలు, కాస్త సోంపు, ఒక ఉల్లిపాయ, 2-3 పచ్చిమిరపకాయ, రెండు యాలకులు, మూడు లవంగాలు, చిన్న ముక్క దాల్చినచెక్క గుప్పెడు జీడిపప్పు, సగం ముక్క ఉల్లిపాయ, కాస్త కరివేపాకు, ఒకటిన్నర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కసూరి మేతీ ఆఫ్ టేబుల్ స్పూన్, రుచికి సరిపడా కారం, 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి, కాస్త కొత్తిమీర, లెమన్ రసం, చెట్టినాడు మసాలా పక్కన పెట్టుకోండి. 

37
ఇలా ఉడికించండి

పాన్‍లో చికెన్ తీసుకుని కొద్దిగా నీరు వేసి అందులో ఉప్పు, పసుపు వేసి ఉడికించండి. చికెన్ 80 శాతం ఉడికితే....వడకట్టి పక్కన పెట్టుకోవాలి. 5 నిమిషాల్లో ఉడికిపోతుందనుకున్న సమయంలో దించేయాలి. మర్చిపోవద్దు.

47
మసాల్ పేస్ట్ తయారీ విధానం

ఇప్పుడు మరో పాన్‍లో 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్, 3 లవంగాలు, సగం అనాస పువ్వు ముక్క, రెండు యాలకులు, అంగుళంన్నర దాల్చినచెక్క, టీ స్పూన్ మిరియాలు, దాల్చిన చెక్క పొంగగానే మూడు ఎండుమిర్చి వేసుకోండి. టీ స్పూన్ జీలకర్ర, రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు, కాస్త సోంపు వేసి పొంగించండి. మరీ వేయించకుండా కాస్త వేయిస్తే చాలు. ఆ తర్వాత ఒక ఉల్లిపాయ ముక్కలు చేసి వేసుకోండి. 2-3 పచ్చిమిరపకాయలు వేసి వేపండి. ఉల్లి కాస్త రంగు మారగానే మిక్సీ జార్‍లో వేసుకుని మెత్తని పేస్ట్ చేసుకోండి. ఇదే గ్రేవీ బేస్.

57
అడుగుపట్టకుండా కలపాలి

మళ్లీ ఇప్పుడు ఇంకో పాన్‍లో 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్, రెండు యాలకులు, 2 లవంగాలు, చిన్న ముక్క దాల్చినచెక్క వేసి వేపండి. ఆ తర్వాత గుప్పెడు జీడిపప్పు వేసి వేగాక సగం ముక్క ఉల్లిపాయ తరుగు, కాస్త కరివేపాకు, ఒకటిన్నర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇది పచ్చివాసన పోయాక పక్కన పెట్టుకున్న ఉడికించిన చికెన్ వేసుకోండి. ఓ నిమిషం వేపి..ఆ తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసి ముక్కలకు పట్టేలా కలిపి వేయించండి. ఇక్కడి నుంచి చికెన్ ను వేయించాలి. అడుగుపట్టకుండా కలుపుతూ ఉండాలి.

67
చంద్రముఖి చికెన్ ఫ్రై రెడీ.

నూనె తేలాక కసూరి మేతీ వేసుకోవాలి. కావాలనుకుంటే ఉడికించిన చికెన్ వాటర్ వేసుకోవచ్చు. రుచికి సరిపడా కారం వేసి వేయించి 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి వేసి కలపండి.కారం, మసాలాలు చికెన్‍కు పట్టేవరకు కలపాలి. అడుగుపడుతున్నా కలపండి. అప్పుడే ఆ స్మోకీ ఫ్లేవర్ దానికొస్తుంది. స్టవ్ ఆపేసి కాస్త కొత్తిమీర, నిమ్మరసం, చెట్టినాడ్ మసాలా వేస్తే చాలు. అవి కలిపేసి పక్కన పెట్టుకోవచ్చు. అంతే చంద్రముఖి చికెన్ ఫ్రై రెడీ.

77
చారన్నంతో అదిరిపోద్ది

చపాతీ, రోటీ, రైస్, స్టార్టర్‌లాగా...ఎలా అయినా తినొచ్చు. చారన్నంతోనైనా అయితే ఇంకా అదిరిపోద్ది. నాన్ వెజ్ ఇష్టపడేవాళ్లు ఈరెసిపీ ట్రై చేయండి. మళ్లీ మళ్లీ చేసుకుని తింటారు. ఇది గ్యారెంటీ. 

Read more Photos on
click me!

Recommended Stories