షుగర్ పేషెంట్లు ఉదయాన్నే వీటిని తాగితే ఎంత మంచిదో..!

First Published | Oct 22, 2023, 8:31 AM IST

ప్రపంచ వ్యాప్తంగా షుగర్ పేషెంట్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. వీళ్లు ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడే వీరి రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మధుమేహులు ఉదయం పరిగడుపున కొన్ని పానీయాలను తాగితే బ్లడ్ షుగర్ పెరిగే అవకాశమే ఉండదు. 
 

మీకు షుగర్ వ్యాధి ఉన్నా లేకున్నా..ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం హెల్తీ ఫుడ్ నే తినాలి. కానీ మధుమేహులు తమ రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉండేందుకు ఎన్నో జాగ్రత్తలను తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఫుడ్ విషయంలో. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. డయాబెటిస్ పేషెంట్లు ఎక్కువగా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, తక్కువ కొవ్వు పాల ఉత్పత్తులు వంటి ఆహారాలను తీసుకోవాలి. అలాగే వీళ్లు స్వీట్లు, రెడ్ మీట్ కు దూరంగా ఉండాలి. డయాబెటిస్ ఉన్నవారు ఉదయం కొన్ని పానీయాలను తాగినా కూడా బ్లడ్ షుగర్ పెరిగే అవకాశం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే? 
 

lemon water

నిమ్మకాయతో గోరువెచ్చని నీరు

ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం కలిపి ఉదయం పరిగడుపున తాగితే ఎంతో మంచిది. ఇది నిర్విషీకరణకు సహాయపడుతుంది. అలాగే మీ బరువును కూడా తగ్గిస్తుంది. ఇది మధుమేహులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 


దాల్చిన చెక్క టీ

దాల్చినచెక్కలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఈ మసాలా దినుసు ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరుస్తుంది. అందుకు ప్రతి రోజూ ఉదయం పరిగడుపున దాల్చినచెక్కను టీని తాగండి. ఇది మీ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుంది.
 

కాకరకాయ రసం

కాకరకాయ చేదుగా ఉన్నా ఇది మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఈ కూరగాయలో ఇన్సులిన్ చర్యను అనుకరించే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి సహాయపడతాయి. ఉదయాన్నే కాకరకాయ రసం తాగడం వల్ల రోజంతా మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి. 
 

Fenugreek Water

మెంతి వాటర్

మెంతుల్లో కరిగే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుంది. ఇందుకోసం మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే ఆ వాటర్ ను పరిగడుపున తాగాలి. 

amla juice

ఉసిరికాయ రసం

ఈ సీజన్ లో ఉసిరికాయలకు కొదవే ఉండదు. దీనిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచడమే కాకుండా రక్తంలో చక్కెర స్థాయిలను కూడా నియంత్రిస్తుంది. అంతేకాదు ఉసిరి మన చర్మానికి, జుట్టకు కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. మధుమేహులు ఏది తీసుకున్నా.. తీసుకోకపోయినా... ఉసిరికాయ రసాన్ని తాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 
 

కలబంద రసం

కలబంద మన చర్మానికి మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది గాయలను తొందరగా మాన్పుతుంది. కలబందలో హైపోగ్లైసీమిక్ ప్రభావాలు కూడా ఉంటాయి. కాబట్టి ఖాళీ కడుపుతో కొద్దిమొత్తంలో కలబంద రసాన్ని తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. 

Latest Videos

click me!